Gujarat: గుజరాత్‌లో దారుణం.. రెండేళ్ల బాలికపై అత్యాచారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రజలు..

గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. కామం ఆవహించి.. కన్నుమిన్నూ కానక.. రెండేళ్ల పసిపాపపై అత్యచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అయితే, చిన్నారిపై

Gujarat: గుజరాత్‌లో దారుణం.. రెండేళ్ల బాలికపై అత్యాచారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రజలు..
Arrest

Updated on: Nov 01, 2022 | 9:51 PM

గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. కామం ఆవహించి.. కన్నుమిన్నూ కానక.. రెండేళ్ల పసిపాపపై అత్యచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అయితే, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. కీచకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన పసిపాపను ఆస్పత్రికి తరలించి.. నిందితుడైన 25 ఏళ్ల ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.

ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరత్‌కు చెందిన శోభదీప్ బాల్కిసన్(25) ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకుడు.. అనువ్రత్ ద్వార్ ఫ్లైఓవర్ కింద ఉన్న స్లమ్ ఏరియాలో ముక్కుపచ్చలారని ఓ 2 ఏళ్ల పసికందును అపహరించాడు. ఇదే విషయంపై సోమవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశారు బాధితులు. చిన్నారిని గుర్తు తెలియని ట్రక్ డ్రైవర్ అపహరించుకుపోయారంటూ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. కంప్లైంట్ కాల్ వచ్చిన ప్రాంతం సహా అన్ని ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి ఓ పీసీఆర్ వ్యాన్ ఆ అగంతకుడిని కనిపెట్టింది. GJ-05- BT- 4300 నంబర్ గల ట్రక్కులో చిన్నారిని అపహరించుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు ఆ ట్రక్కుని ఆపి చెక్ చేయగా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై పోక్సో, ఐసీపీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..