
స్నానం చేసేందుకు వాటర్ హీటర్‌తో వేడి నీళ్లు పెట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ పురి ఏరియాకు చెందిన నిధి (21) లక్ష్మి (19) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. అయితే బుధవారం స్నానం చేసేందుకు ఇంట్లో ఉన్న వాటర్ హీటర్‌ను బకెట్‌లో ఉంచారు. అయితే బకెట్‌లోంచి పొగలు రావడం గమనించిన నిధి హీటలర్ తీసేందుకు వెళ్లి రాడ్‌ను పట్టుకుంది.
దీంతో వెంటనే ఆమెకు షాక్ కొట్టింది. అది గమనించిన చెల్లి లక్ష్మి అక్కను కాపాడేందుకు ప్రయత్నించగా ఆమె కూడా కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా రోధించారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో వాటర్ హీటర్ పెట్టేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచించారు.
Immersion Heater Safety
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి