వివాదాస్పద స్థలంలో హిందూ దేవతల చిత్రాలు

|

Aug 16, 2019 | 5:22 PM

అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏడోరోజు విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు రామలల్లా తరపు సీనియర్ లాయర్ సీఎస్ వైద్యనాథన్. వివాదాస్పద స్థలంలోని స్తంభాలపై పలు దేవతల చిత్రాలున్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటో ఆల్బమ్ తో పాటు, ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ వివాదానికి సంబంధించి కోర్టు నియమించిన కమిషనర్..1950 ఏప్రిల్ 16న సమర్పించిన నివేదికను కోర్టుకు వినిపించారు. […]

వివాదాస్పద స్థలంలో హిందూ దేవతల చిత్రాలు
Follow us on

అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏడోరోజు విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు రామలల్లా తరపు సీనియర్ లాయర్ సీఎస్ వైద్యనాథన్. వివాదాస్పద స్థలంలోని స్తంభాలపై పలు దేవతల చిత్రాలున్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటో ఆల్బమ్ తో పాటు, ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు.

ఈ వివాదానికి సంబంధించి కోర్టు నియమించిన కమిషనర్..1950 ఏప్రిల్ 16న సమర్పించిన నివేదికను కోర్టుకు వినిపించారు. దాని ప్రకారం ఆ స్థలంలోని స్తంభాలపై శివుడికి సంబంధించిన పలు చిత్రాలున్నాయని కోర్టుకు తెలిపారు. అలాంటి చిత్రాలు కేవలం ఆలయాల్లో మాత్రమే ఉంటాయని..మసీదుల్లో ఉండవని పేర్కొన్నారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించిన కేసులో మధ్యవర్తిత్వం విఫలమవడంతో ఈ కేసును సుప్రీంకోర్ట్ రోజువారీ విచారణ జరుపుతోంది.