Aadhaar-Pan Card: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేస్తున్నారా..? లేకపోతే వెంటనే చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయడానికి 2021 మార్చి 31 వరకు గడువు విధించింది ఆదాయ పన్ను శాఖ. ఈ గడువులోగా అనుసంధానం చేయకపోతే 2021 ఏప్రిల్ 1 నాటికి మీ పాన్ కార్డు రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయడం చాలా సింపుల్. ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డులలో అందించిన సమాచారం ఒకదానికి మరొకటి సరిపోకపోతే.. అదే పెద్ద సమస్యగా మారుతుంది.
దేశవ్యాప్తంగా ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వారి పేరు, పుట్టిన తేదీ తదితర ముఖ్యమైన సమాచారం.. పాన్ కార్డు, ఆధార్ కార్డులలో డిఫెరెంట్‌గా ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేసేటప్పుడు ఆదాయపు పన్ను విభాగం(UIDAI) ఆ డేటాను పూర్తిగా పరిశీలిస్తుంది. రెండు డాక్యుమెంట్స్‌లోనూ పొందుపరిచిన సమాచారం సరిపోకపోతే, అభ్యర్థన తిరస్కరించబడుతుంది.
డేటా సరిపోని కారణంగా మీ పాన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్ధన తిరస్కరించబడితే, అప్పుడు మీకు బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎన్‌ఎస్‌డిఎల్ పోర్టల్ నుండి ఆధార్ సీడింగ్ రిక్వెస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తరువాత, మీ సమీపంలోని పాన్ కార్డు సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను ఆఫ్‌లైన్ ద్వారా పూర్తి చేయండి. మీరు ఎన్‌ఎస్‌డిఎల్ లేదా యుటిఐటిఎస్ఎల్ వెబ్‌సైట్ సహాయంతో మీ సమీపంలోని పాన్ సెంటర్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.
ఇది కొంచెం సులభతరమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, రెండు డాక్యుమెంట్స్‌లో ఇచ్చిన మిగతా వివరాలను నింపాలి. ఇది కాకుండా, మీరు మరొక సులువైన మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. దాని సహాయంతో ఆధార్- పాన్ లింకింగ్ ప్రక్రియ ఈజీగా పూర్తవుతుంది. మీరు అవసరమైన సమాచారాన్ని కావాల్సిన డాక్యుమెంట్స్‌లో ఒకదానిలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత, మీరు పాన్-ఆధార్ కార్డుల ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు.
గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయకపోతే వినియోగదారుడికి పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, అలాగే రూ.50వేలకుపైగా నగదు లావాదేవీలు జరపడం, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం, మీ ఆధార్ కార్డుకు పాన్‌కార్డు లింక్ తప్పనిసరి చేసింది.
అయితే ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయడానికి 2021 మార్చి 31 వరకు గడువు విధించింది ఆదాయ పన్ను శాఖ. ఈ గడువులోగా అనుసంధానం చేయకపోతే 2021 ఏప్రిల్ 1 నాటికి మీ పాన్ కార్డు రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. రద్దయిన మీ పాన్ కార్డు కోసం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. అంతేకాదు.. రద్దయిన పాన్ కార్డు కలిగి ఉన్నవారిని పాన్ కార్డు లేనివారిగా పరిగణిస్తామని పేర్కొంది. ఇక ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద వారికి రూ.10 వేల జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేసింది.
కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!