
ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు.. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని, దీనికి సైన్యం సిద్దంగా ఉండాలన్నారు. ఈ అవకాశం వెంటనే ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటునట్టు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో సంయమనం అనే మాట వినపడదన్నారు ఆర్మీ చీఫ్.. మాట వినకుంటే.. భూగోళంలో పాకిస్తాన్‌ను లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ తో జరిగిన ఈ యుద్దంలో దేశమంతా ఐకమత్యంగా పోరాడిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను సైన్యం, ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేశాయన్నారు. హద్దు మీరితే.. కఠిన చర్యలు తప్పవన్నారు. భూగోళంలో ఉండాలో లేదో పాకిస్తాన్ తేల్చుకోవాలంటూ ద్వివేది హెచ్చరించారు.
కాగా.. రాజస్థాన్‌లోని ఇండో పాక్ సరిహద్దు ప్రాంతమైన శ్రీగంగానగర్ అనుప్‌గఢ్ ను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా ద్వివేది జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే పొరుగు దేశం తన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం మానేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యూఢిల్లీ చూపిన సంయమనం భవిష్యత్తులో చూపమని హెచ్చరించారు. “ఒక దేశంగా భారతదేశం ఈసారి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈసారి, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని అది ప్రదర్శించదు. ఈసారి మనం ఒక అడుగు ముందుకు వేసి, పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటున్నారా లేదా అని ఆలోచించేలా వ్యవహరిస్తాము” అని జనరల్ ద్వివేది అన్నారు.
“మేము ఉగ్రవాదులకు హాని కలిగించాలని మాత్రమే కోరుకుంటున్నాము కాబట్టి లక్ష్యాలను గుర్తించాము. వారి స్థావరాలపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. పాకిస్తాన్‌లోని సాధారణ పౌరులపై మాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారి దేశం ఉగ్రవాదులను స్పాన్సర్ చేస్తున్నందున, ఆ ఉగ్రవాద లక్ష్యాలను ఛేదించారు” అని జనరల్ ద్వివేది తన ప్రకటనలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..