తన అందంతో ముగ్గులోకి దించడం. వారితో ఉన్న ఫోటోలను వీడియోలను చూపడం.. భారీ ఎత్తున డబ్బు డిమాండ్ చేయడం. ఇదీ ఒడిశా వగలాడి అర్చనా నాగ్ నిర్వాకం. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఈమె.. తానుగానీ నిజాలు మాట్లాడ్డం మొదలు పెడితే స్టేట్ స్టేట్ షేక్ అయిపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. కొందరు ప్రముఖులపై అందాల వల వేసి.. వారిని తన వైపునకు ఆకర్షించడం. వారితో సన్నిహితంగా ఉన్నపుడు ఫోటోలు, వీడియోలను చిత్రించడం.. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం అనే ఆరోపణలపై ఈడీ కస్టడీలో ఉంది.. అర్చనా నాగ్ అనే మహిళ. విచారణ కోసం ఈడీ ఆఫీసుకు తరలించడంకన్నా ముందు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జార్పాడ స్పెషల్ జైలు నుంచి భువనేశ్వర్ క్యాపిల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన దగ్గర రాష్ట్రాన్ని అట్టుడికించేలాంటి ఎక్స్ క్లూజివ్ సాక్ష్యాలున్నాయనీ. ఈడీ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తాననీ.. ఈ విచారణ కోసమే తాను ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్నాననీ అన్నారామె. నేనుగానీ ఒక ముప్పై నిమిషాల పాటు మాట్లాడితే.. రాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోతుందనీ. నన్నే.. ట్రాప్ లో పడేశారనీ. అందుకు తగిన ఆధారాలున్నట్టు చెప్పిందీ మహిళ. ఎవ్వరినీ వదిలి పెట్టనని కూడా హెచ్చరించారీమె.
తనను అరెస్టు చేసిన తీరుపైనా పోలీసులపై పలు విమర్శలు గుప్పించారు అర్చనా నాగ్. తానేమీ ఉగ్రవాదిని కాదనీ.. పోలీసులు తనను అరెస్టు చేసిన తీరు, తన కుటుంబాన్ని వేధించిన పద్ధతిని చూస్తుంటే.. ఇదంతా కుట్రలా ఉందని ఆరోపించారామె. మరోవైపు సెక్స్ రాకెట్ తో పాటు కొందరు సంపన్నులను బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా.. ఈమె భారీగా కూడబెట్టారనీ. దీంతో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా అర్చనను ఏడు రోజుల పాటు కస్టడీలో తీసుకున్నారు ఈడీ అఫిషియల్స్.
డిసెంబర్ 13న అర్చనా నాగ్ ను తిరిగి జిల్లా సెషన్సు కోర్టులో హాజరు పరుస్తారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 9 మందిని విచారించిన ఈడీ.. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న అర్చన భర్త జగబంధు ను ఈరోజు కోర్టు ముందు హాజరు పరచనున్నారు. 2018 నుంచి కేవలం నాలుగేళ్లలోనే ఈ జంట.. భువనేశ్వర్ సత్య విహార్ లో విశాలవంతమైన బంగ్లా. దీంతో పాటు మరో 30 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయ్. ఇందులో భాగంగానే అర్చనా నాగ్ ను.. అక్టోబర్ ఆరున అరెస్టు చేశారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..