మాట్లాడే స్వేచ్ఛ లేదు.. నాకెందుకు ఈ ఐఏఎస్..!

| Edited By:

Aug 25, 2019 | 2:00 AM

యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు.  దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం సెక్రెటరీకి లేఖ పంపారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఐఏఎస్ విధుల్లో చేరానో వాటిని పాటించలేకపోతున్నానని ఆలేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొంతు లేని వాళ్లకు గొంతు కాగలనని ఆనాడు భావించానని, అయితే ఇప్పుడు […]

మాట్లాడే స్వేచ్ఛ లేదు.. నాకెందుకు ఈ ఐఏఎస్..!
Follow us on

యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు.  దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం సెక్రెటరీకి లేఖ పంపారు. తాను ఏ ఉద్దేశ్యంతో ఐఏఎస్ విధుల్లో చేరానో వాటిని పాటించలేకపోతున్నానని ఆలేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొంతు లేని వాళ్లకు గొంతు కాగలనని ఆనాడు భావించానని, అయితే ఇప్పుడు తన సొంత గొంతును కూడా విప్పలేకపోతున్నానంటూ బాధను వ్యక్తం చేశారు కన్నన్. తనకు వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని తెలుపుతూ తనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయాలని కోరారు. తన భార్య చాల మంచిదని, తన అభిప్రాయాలను గౌరవిస్తుందని చెప్పారు.  అయితే ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే  ఆర్టికల్ 370 రద్దు విషయంలో తన ఆలోచనల్ని స్వేచ్ఛగా చెప్పలేకపోయాననే ఆవేదన గోపీనాథ్ ఆ లేఖలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

ఎవరీ కన్నన్ గోపీనాథ్..

గత ఏడాది కేరళలో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో దాద్రా నగర్ హవేలీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఓ సామాన్యుడిలా వరద సహాయక పనుల్లో మూటలు మోసి వార్తల్లో నిలిచిన వ్యక్తి. బాధితులకు సహాయం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న మరో అధికారి ఈయనను గుర్తించే వరకు ఎవ్వరికీ ఆయన కలెక్టర్ అనే విషయమే తెలియలేదు. దీంతో ఆయన సేవాభావాన్ని చూసి అక్కడున్న వారితో పాటు దేశం మొత్తం ఆయనను కొనియాడారు. స్వతంత్రభావాలు, సమాజంపై వ్యక్తిగత అభిప్రాయాలు, సేవాభావం కలిగిన ఈ యువ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం తీవ్ర మరో సంఘర్షణకు లోనవుతున్నట్టు పలువురు అధికారులు భావిస్తున్నారు. అందువల్లే తనను రిలీవ్ చేయాలంటూ లేఖ రాసి ఉంటారని చెబుతున్నారు.