ఫ్రాన్స్ నుంచి ఇండియాకు రఫేల్ యుధ విమానాలు అందడాన్ని భారత వైమానికదళం మాజీ చీఫ్ బీఎస్.ధనౌవా స్వాగతించారు. రాజకీయ వివాదాలకు తావు లేకుండా వీటిని పొందడం ముదావహమన్నారు. లోగడ..1980 ప్రాంతాల్లో బోఫోర్స్ ఒప్పందం పెద్దఎత్తున రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో నేతలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రక్షణ సాధనాలను కొనుగోలు చేసే విషయంలో.. భారత సైన్యం సందేహిస్తూ వచ్చింది. అయితే రఫేల్ ఫైటర్ల విషయంలో అలా జరగకపోవడం హర్షణీయమని, ఈ డీల్ కి రాజకీయ మకిలి అంటకపోవడం మంచి పరిణామమని ధనౌవా పేర్కొన్నారు. వీటి కొనుగోలును సమర్థిస్తున్నా అన్నారు. ఈ విమానాలు మన వైమానిక దళ సామర్థ్యానికి ప్రతీక అవుతాయన్నారు.
ఫ్రాన్స్ నుంచి ఇండియాకు నిన్న తొలివిడతలో భాగంగా ఐదు రఫేల్ విమానాలు అందాయి. ఇవి అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి.