ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం.. కౌంటర్లు, సెటైర్లతో హీట్ పెంచుతున్న నేతలు

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో డైలాగ్‌వార్‌ కొనసాగుతోంది. ఆప్‌ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, యమునా జలాలను కలుషితం చేశారని యూపీ సీఎం యోగి విమర్శించారు. అయితే తమపై విమర్శలు చేస్తున్న యోగి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం.. కౌంటర్లు, సెటైర్లతో హీట్ పెంచుతున్న నేతలు
Yogi Vs Aravind Kejriwal

Updated on: Jan 23, 2025 | 9:27 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఆమ్‌ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ , కాంగ్రెస్‌ కూడా ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. మూడు పార్టీల తరపున అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సుడిగాలి ప్రచారం చేశారు. ఆప్‌ తరపున పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఉత్తరప్రదేశ్‌ సీఎ యోగి.. ఢిల్లీలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. పవిత్ర యమునా నదిని కాలష్యమయం చేశారని మండిపడ్డారు.. ఢిల్లీ అల్లర్ల వెనుక ఆప్‌ ఎమ్మెల్యల హస్తముందన్నారు. గత పదేళ్ల నుంచి అబద్దపు హామీలతో ఢిల్లీ ప్రజలను ఆమ్‌ ఆద్మీ పార్టీ మోసం చేసింది. ఢిల్లీని నరకంలా మార్చేశారు. ఆప్‌ పాపాల ఫలితంగా యూపీ లోని మధుర, బృందావన్‌ , ఆగ్రా లాంటి నగరాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. యమునా నది నీళ్లు కలుషితమయ్యాయి. ప్రధాని మోదీ చేపట్టిన నమామే గంగా ప్రాజెక్ట్‌ కింద గంగానదిని ఉత్తరప్రదేశ్‌లో శుద్ది చేశాం.. దాని ఫలితం ప్రయాగ్‌రాజ్‌లో కన్పిస్తోంది.

అయితే యోగి వ్యాఖ్యలకు కేజ్రీవాల్‌ అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. ఆప్‌ పాలనపై విమర్శించే ముందు యోగి ఉత్తరప్రదేశ్‌లో స్కూళ్ల పరిస్థితి చూసుకోవాలన్నారు. యూపీలో బీజేపీ పదేళ్ల నుంచి అధికారంలో ఉందని , విద్యావ్యవస్థను బాగు చేసుకోలేకపోయారన్నారు. యూపీ సీఎం యోగి ఢిల్లీకి వచ్చి విమర్శలు చేస్తున్నారు. యూపీలో ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి గురించి ఆయన ఆలోచించాలి. పదేళ్ల నుంచి యూపీలో బీజేపీ అధికారంలో ఉంది . స్కూళ్లను బాగు చేయలేదు..కావాలంటే మా విద్యాశాఖ మంత్రిని యూపీకి పంపిస్తాం.. స్కూళ్లను ఎలా బాగు చేయాలో చూపిస్తాం.. యూపీ స్కూళ్లు బాగుపడాలని కోరుకుంటున్నాం.. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంటే.. ఇండి కూటమి లోని పార్టీలన్నీ ఆప్‌కు మద్దతిస్తున్నాయి.