PM Narendra Modi: ట్విట్టర్ యూజర్ ప్రశ్న.. అది నాకు తెలుసు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రిప్లై.. ఏం సమాధానం చెప్పారంటే..

PM Narendra Modi: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ట్విట్టర్‌లో ఫాలోవర్స్..

PM Narendra Modi: ట్విట్టర్ యూజర్ ప్రశ్న.. అది నాకు తెలుసు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రిప్లై.. ఏం సమాధానం చెప్పారంటే..

Updated on: Jan 16, 2021 | 4:16 PM

PM Narendra Modi: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ట్విట్టర్‌లో ఫాలోవర్స్ విషయంలో ఆయనే తొలి స్థానంలో ఉన్నారు. ఆంతే స్థాయిలో ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఓ ట్విటర్ ఖాతాదారు వేసిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. లాస్ట్ టెంపుల్స్ అనే ఒక ట్విట్టర్ ఖాతా ఉంది. ఆ అకౌంట్‌లో దేవాలయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో రాత్రివేళ విద్యుత్ దీప కాంతులతో అలరారుతున్న నదీ తీరం, నదీ తీరంలో పూజలు చేస్తున్న భక్తులు, ఆ పక్కనే అద్భుత దేవాలయం కూడా ఉంది. ఆయితే ఆ ఫోటోను షేర్ చేసిన లాస్ట్ టెంపుల్స్.. ‘ఈ అద్భుత నగరాన్ని మీరు గుర్తుపట్టగలరా?’ అంటూ ప్రశ్న వేశారు.

ఆ ఫోటో కాస్తా అటు తిరిగి.. ఇటు తిరిగి ప్రధాన నరేంద్ర మోదీ కంటపడింది. దాంతో ఆయన ఆ ఫోటోపై స్పందించారు. ఆ ఫోటోలో ఉన్న ఆలయం తనకు తెలుసునంటూ సమాధానం చెప్పేశారు. లాస్ట్ టెంపుల్ షేర్‌ చేసిన ఫోటోను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఆ ఫోటోలో కనిపిస్తున్న నగరం ఉత్తరప్రదేశ్‌లో కాశీ పుణ్యక్షేత్రం. అక్కడ ఉన్నది రత్వేశ్వర్ మందిరం’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రధాని సమాధనం చేబుతూ ఇచ్చిన రిప్లైకి క్షణాల వ్యవధిలో వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. కాగా, లాస్ట్ టెంపు ట్విట్టర్ ఖాతాను ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా ఫాలో అవుతున్నారు.

Prime Minister Modi Tweet:

Also read:

Mumbai Schools Closed: దేశ ఆర్ధిక రాజధాని ముంబై‌లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. పాఠశాల మూసివేత

Somuveerraju, Mudragada: కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడతో భేటీ అయిన సోమువీర్రాజు.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ