I.N.D.I.A Rally: బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ‘ఉలుగులన్’ ర్యాలీ.. ఏకమైన 28 ప్రతిపక్ష పార్టీలు

|

Apr 21, 2024 | 9:42 PM

భారతీయ జనతా పార్టీతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉందని రాంచీ ర్యాలీలో ఇండియా కూటమి నేతలు హెచ్చరించారు. కేజ్రీవాల్‌ , హేమంత్‌ సోరెన్‌ లాంటి నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారని మండిపడ్డారు. 28 పార్టీల నేతలు ఈ సభకు హాజరయ్యారు.

I.N.D.I.A Rally: బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉలుగులన్ ర్యాలీ.. ఏకమైన 28 ప్రతిపక్ష పార్టీలు
I.n.d.i.a Bloc Rally In Ranchi
Follow us on

భారతీయ జనతా పార్టీతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉందని రాంచీ ర్యాలీలో ఇండియా కూటమి నేతలు హెచ్చరించారు. కేజ్రీవాల్‌ , హేమంత్‌ సోరెన్‌ లాంటి నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారని మండిపడ్డారు. 28 పార్టీల నేతలు ఈ సభకు హాజరయ్యారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియా కూటమి నేతలు బీజేపీపై గర్జించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం లోకి వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అనారోగ్యం కారణంగా రాహుల్‌గాంధీ ఇండియా కూటమి ర్యాలీకి హాజరుకాలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి , అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా కేంద్రం దారుణంగా అవమానించిందని విమర్శించారు ఖర్గే.గత పదేళ్లలో ఎస్సీ , ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ , పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భార్య సునితా , జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ , ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు కూటమి నేతలు ఈ సభకు హాజరయ్యారు. తిహార్‌ జైల్లో తన భర్తకు మందులు ఇవ్వడం లేదని . జైల్లోనే చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునితా కేజ్రీవాల్‌. ఎలాంటి నేరం చేయని తన భర్తను అన్యాయంగా జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం తన భర్త పోరాడుతున్నారని అన్నారు.

ఈసారి అధికారం లోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలంటున్నారని , బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌. బీజేపీ పాలన కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత పరువు దిగజారుతోందన్నారు. ఈ ర్యాలీలో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ర్యాలీలో కేజ్రీవాల్, సోరెన్‌లకు ప్రత్యేకంగా కుర్చీలు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ‘ఉలు‌గులన్ న్యాయ్ మహరల్లీ’ పేరుతో జార్ఖండ్ ముక్తి మోర్చా ర్యాలీ నిర్వహించింది.

‘ఉలుగులన్’ అంటే..

ఇదిలావుంటే, ‘ఉలుగులన్’ అంటే విప్లవం అని అర్థం. గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారిపై బిర్సా ముండా చేసిన పోరాటంలో ఈ పదం ఉద్భవించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…