పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీ సీఏఏ గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. అంతేకాదు ఆయనకు సవాల్ కూడా విసిరారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. ఆయన దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో కనీసం రెండు వాక్యాలైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఈ చట్టం గురించి రాహుల్‌ను కనీసం10 వాక్యాలు మాట్లాడమనండంటూ నడ్డా సవాల్ విసిరారు. అసలు సీఏఏను రాహుల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కనీసం రెండు మాటల్లోనైనా చెప్పాలన్నారు. అసలు విషయానికి వస్తే.. ఆయనకు ఏమీ తెలియదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే కాంగ్రెస్ నేతలు సీఏఏను వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు.