Lovers Caught: భర్త వెళ్లిపోయాడని ప్రియుడిని పిలిచింది.. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా బిగ్ ట్విస్ట్.. ఊరు ఊరంతా కలిసి..

Bihar News: ఓ మహిళకు వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్త పనిమీద బయటకు వెళ్లగా.. తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి రొమాన్స్ చేస్తుండగా.. సడెన్‌గా ఇంటికి వచ్చాడు ఆమె భర్త. డోర్ ఓపెన్ చేయగా.. భార్య ఆమె ప్రియుడు అసభ్యకరమైన స్థితిలో కనిపించారు. దాంతో ఆగ్రహించిన భర్త.. ఇద్దరినీ పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. బజార్లో కర్రతో విచక్షణారహితంగా..

Lovers Caught: భర్త వెళ్లిపోయాడని ప్రియుడిని పిలిచింది.. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా బిగ్ ట్విస్ట్.. ఊరు ఊరంతా కలిసి..
Representative Image

Updated on: Jul 30, 2023 | 9:09 AM

బీహార్, జులై 30: రాను రాను వివాహ బంధానికి విలువే లేకుండా పోతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకారం తెలుపడం.. పెళ్లయ్యాక ప్రియుడు/ప్రియురాలి తోనూ అక్రమ సంబంధాలు నెరపడం పరిపాటిగా మారింది ప్రజలకు. ఫలితంగా వివాహా బంధానికి బీటలు బారుతున్నారు. ఈ వ్యవహారాల్లోనే ఎంతో మంది స్త్రీ, పురుషులు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు విడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని, రొమాన్స్ చేస్తుండగా.. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తరువాత ఊరంతా తిప్పుతూ దారుణంగా కొట్టాడు. ఊరు ప్రజలు కూడా మహిళను, ఆమె ప్రియుడిపై దాడి చేశారు. ఆ తరువాత వారికి గుండు కొట్టించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని మోతీహారి గ్రామానికి చెందిన ఓ మహిళకు వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్త పనిమీద బయటకు వెళ్లగా.. తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి రొమాన్స్ చేస్తుండగా.. సడెన్‌గా ఇంటికి వచ్చాడు ఆమె భర్త. డోర్ ఓపెన్ చేయగా.. భార్య ఆమె ప్రియుడు అసభ్యకరమైన స్థితిలో కనిపించారు. దాంతో ఆగ్రహించిన భర్త.. ఇద్దరినీ పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. బజార్లో కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. గ్రామస్తులు సైతం వారిపై అటాక్ చేశారు. అది చాలదన్నట్లుగా.. మహిళకు, ఆమె ప్రియుడికి చెరో కర్ర ఇచ్చి ఒకరినొకరు కొట్టుకోవాలంటూ ఆర్డర్ వేశారు. అలా వారిద్దరినీ రక్తమోడేదాకా కట్టారు. ఆ తరువాత.. ఇద్దరిని ఊరి మధ్యలో కూర్చొబెట్టి గుండు కొట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మహిళ, ఆమె ప్రియుడితో పాటు వారిద్దరిపై దాడి చేసిన భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..