Delhi violence : వెల్లివిరిసిన మానవత్వం..సిక్కుల సాహసానికి హ్యాట్సాఫ్

|

Mar 01, 2020 | 10:58 AM

గత కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వరుస అల్లర్లతో అట్టుడికిపోయింది. క్షణక్షణం రగులుతున్న అగ్నిగుండంలా ఢిల్లీ వీధులు రావణ కాష్టాన్ని తలపించాయి. రెచ్చిపోయిన అల్లరి మూకలు..వాహనాలు, ఇళ్లకు నిప్పుపెడుతూ...బీభత్సం సృష్టించారు. అంతటి హింసలోనూ అక్కడ మానవత్వం వెల్లివిరిసింది.

Delhi violence : వెల్లివిరిసిన మానవత్వం..సిక్కుల సాహసానికి హ్యాట్సాఫ్
Follow us on

గత కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వరుస అల్లర్లతో అట్టుడికిపోయింది. క్షణక్షణం రగులుతున్న అగ్నిగుండంలా ఢిల్లీ వీధులు రావణ కాష్టాన్ని తలపించాయి. రెచ్చిపోయిన అల్లరి మూకలు..వాహనాలు, ఇళ్లకు నిప్పుపెడుతూ…బీభత్సం సృష్టించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 42 మంది చనిపోయినట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఇంకా 200 మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా, అంతటి హింసలోనూ అక్కడ మానవత్వం వెల్లివిరిసింది.

సిక్కు కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు పదుల సంఖ్యలో ముస్లింల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే…ఫిబ్రవరి 24…అది ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతం.. అక్కడ ఎటు చూసినా ఆందోళనలు, అల్లర్లు, రాళ్లదాడులు, విధ్వంసాలే దర్శనమిచ్చాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా పరిస్థితులకు బలైపోతున్నారు. చుట్టు ముడుతున్న అల్లరి మూకల నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలోనూ తొక్కిసలాట జరిగింది. దూసుకొస్తున్న ఆందోళనకారుల పంజా నుంచి రెండు వాహనాలపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సహాయక చర్యలు మొదలు పెట్టారు. కనిపించిన బాధితులను వారి బైక్‌లపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలా ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన సహాయంతో మొత్తం 60 నుంచి 70 మంది ముస్లింలు ప్రాణపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

అయితే, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే…వారిని కాపాడిన ఆ ఇద్దరు వ్యక్తులు సిక్కులు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీలో ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సిక్కు తండ్రి వెల్లడించారు. ఆ రోజున ఇక్కడ తాము చూసిన ఘటన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తుచేసుకుని భయపడిపోయామన్నారు.. తాము కాపాడిన వారంతా ముస్లింలేనని, అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. అయితే, తాము కేవలం మానవతా దృపక్పథంలోనే వారిని కాపాడామని చెప్పారు. సిక్కు తండ్రీ కొడుకుల ఔదార్యానికి ఢిల్లీ వాసులతో పాటుగా, నెటిజన్లను సైతం సెల్యూట్ చేస్తున్నారు.