IRCTC Account: కోవిడ్ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు.. ప్రస్తుతం పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. ఇక పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. అయితే చాలా మంది రైలు టికెట్ బుక్ చేసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వెబ్ సైట్, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురుంచి ఐఆర్‌సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది.
► ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
► అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
► మీ యూజర్ నేమ్ నమోదు చేయండి
► ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్‌లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి.
► భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి.
► ఆ తర్వాత మీ పేరు, లింగం, వృత్తి, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
► తర్వాత మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి.
► ఆ తర్వాత పిన్ కోడ్‌తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి.
► మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.
Want to book train tickets but do not have an #IRCTC account yet.
Create your #IRCTC ticketing account in these simple steps and book your train tickets now.#userregistration #irctcticketing #irctcaccount #trainbooking— IRCTC (@IRCTCofficial) October 18, 2021