
రష్యా నుంచి ఏ దేశమైనా చమురు కొనుగోలు చేస్తే బాగోదు మరి.. అని ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ ఉంటుంది. కానీ మన దేశం మాత్రం రష్యా నుంచి చమురు కొంటూనే ఉంది. పోనీ మనం ఒక్కరిమే ఇలా చేస్తున్నామా అంటే కాదు. ఇదేమో ట్రంప్ సర్కారుకు కోపం తెప్పిస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొనే దేశాల ఎక్స్‌పోర్ట్స్ పై 100 శాతం టారిఫ్ వేయడానికి ఛాన్స్ ఇచ్చే బిల్లుకు.. అమెరికా చట్టసభలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ట్రంప్ సంతకంతో ఇది కార్యరూపం దాలుస్తుంది. దీనిపై మన దేశం కూడా క్లారిటీ ఇచ్చింది. ఆంక్షల బిల్లును జాగ్రత్తగా గమనిస్తూనే.. రియాక్ట్ అయ్యింది. మనకేమో మన దేశ ఇంధన భద్రత ముఖ్యం. దీనికి అనుగుణంగానే వివిధ వనరుల ద్వారా మన దేశానికి ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇదే విషయాన్ని అమెరికాకు భారత్ గతంలోనూ చెప్పింది.. ఇప్పుడు కూడా అదే చెప్పింది. అయినా రష్యాతో ఆయిల్ బిజినెస్ విషయాన్ని అమెరికాతో గత కొన్నాళ్లుగా చర్చిస్తూనే ఉంది. ఇక 100 శాతం టారిఫ్ ల బిల్లు కార్యరూపం దాలిస్తే.. ఇరు దేశాల సంబంధాల పైనా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మార్కెట్ల్ పైనా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదే విషయాన్ని అమెరికాకు క్లియర్ గా, క్లారిటీగా చెప్పింది. ...