ప్రకృతి వైపరీత్యం, కేరళలో తౌక్తే తుపాను బీభత్సం, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, గ్రామాలు జల దిగ్బంధం

| Edited By: Phani CH

May 15, 2021 | 4:54 PM

అరేబియా సముద్రంలో రేగిన తౌక్తే తుపాను అప్పుడే తన విలయాన్ని చూపడం ప్రారంభించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి.

ప్రకృతి వైపరీత్యం, కేరళలో తౌక్తే తుపాను బీభత్సం, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ,  గ్రామాలు జల దిగ్బంధం
World Ocean Day
Follow us on

అరేబియా సముద్రంలో రేగిన తౌక్తే తుపాను అప్పుడే తన విలయాన్ని చూపడం ప్రారంభించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, పలక్కాడ్, వయనాడ్ , కోజికోడ్ వంటి అనేక జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కసరగడ్ జిల్లాలో చూస్తుండగానే ఓ చిన్న భవనం పేకమేడలా నీటిలో కూలిపోయింది. అప్పటికే అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీస్తున్న పెను గాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. కరెంట్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోస్తాలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. త్రిసూర్ లో పలు ఇళ్ళు నీట మునగడంతో స్థానికులను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు, రిలీఫ్ సెంటర్లకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, లైఫ్ బోట్లు తదితరాలను సిద్ధంగా ఉంచామని వారు చెప్పారు.

ఈ తౌక్తే తుపాను ప్రభావం కేరళతో బాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా కనిపించింది. ప్రధాని మోదీ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పలు చోట్ల కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో రెండు రోజులు ఈ తుపాను ప్రభావం ఉండవచ్చునని భావిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Plasma Therapy: కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేదా? ఐసీఎంఆర్ ఏం చెప్పింది? ప్లాస్మా థెరపీ..నమ్మలేని నిజాలు!

ఈ ప్రదేశం ఒక్కటే యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తుంది.. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే.. ఎక్కడుందంటే..