కోలుకున్న అమిత్ షా, త్వరలో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

అస్వస్థత  కారణంగా  ఢిల్లీలోని ఎయిమ్స్ లో  చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్టు ఈ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మొదట కోవిడ్ పాజిటివ్ లక్షణాలతో..

కోలుకున్న అమిత్ షా, త్వరలో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

Edited By:

Updated on: Aug 29, 2020 | 5:45 PM

అస్వస్థత  కారణంగా  ఢిల్లీలోని ఎయిమ్స్ లో  చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్టు ఈ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మొదట కోవిడ్ పాజిటివ్ లక్షణాలతో ఆయన ఈ నెల 2 న గుర్ గావ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే అలసట, స్వల్ప ఛాతీ నొప్పితో ఆయన ఈ నెల 18 న ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, నేడో రేపో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యాన ప్రత్యేక వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. హాస్పటల్ లో ఉన్నప్పటికీ ఆయన తన అధికారిక కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వహిస్తూ వచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us