ఇక ఇంటివద్దకే పెట్రోల్‌, సీఎన్‌జీ..!

| Edited By:

May 30, 2020 | 2:07 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరుకులు కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు తెరిచిఉన్నప్పటికీ.. కరోనా భయంతో.. వణికిపోతున్నారు. ఇక అనేక మంది దూర ప్రయాణాలను విరమించుకొంటున్నారు. అనవరసమైన ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాటు.. వాహానాల ఉపయోగం కూడా తగ్గిస్తున్నారు. దీంతో ఇందన ఉపయోగం తగ్గింది. ఇక లాక్‌డౌన్ సమయలో పెట్రోల్ కొనేందుకు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. పెట్రోల్, సీఎన్‌జీలను హోం డెలివరీ చేసేందుకు […]

ఇక ఇంటివద్దకే పెట్రోల్‌, సీఎన్‌జీ..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యవసర సరుకులు కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు తెరిచిఉన్నప్పటికీ.. కరోనా భయంతో.. వణికిపోతున్నారు. ఇక అనేక మంది దూర ప్రయాణాలను విరమించుకొంటున్నారు. అనవరసమైన ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాటు.. వాహానాల ఉపయోగం కూడా తగ్గిస్తున్నారు. దీంతో ఇందన ఉపయోగం తగ్గింది. ఇక లాక్‌డౌన్ సమయలో పెట్రోల్ కొనేందుకు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. పెట్రోల్, సీఎన్‌జీలను హోం డెలివరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇప్పటికే పలు నగరాల్లో డీజిల్‌ను హోం డెలివరీ చేస్తున్నామని తెలిపారు. ఇదేవిధంగా ఇక పెట్రోల్, సీఎన్‌జీలను కూడా హోం డెలివరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు పెట్టిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే.. పలు సెలక్టెడ్ సిటీల్లో డీజిల్‌ను 2018 నుంచే హోం డెలివరీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.