ముహూర్తం కుదిరింది: ఈ నెల 29న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

| Edited By:

Dec 25, 2019 | 7:32 AM

జార్ఖండ్ తదుపరి సీఎంగా జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమి నాయకుడు హేమంత్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. కూటమి నేతలతో మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది ముర్మను హేమంత్ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని […]

ముహూర్తం కుదిరింది: ఈ నెల 29న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Follow us on

జార్ఖండ్ తదుపరి సీఎంగా జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమి నాయకుడు హేమంత్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. కూటమి నేతలతో మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది ముర్మను హేమంత్ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరగా.. ఆమె అంగీకరించారు. దీంతో 29న హేమంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

ఇక ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించాలని సోరెన్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మరోవైపు జార్ఖండ్‌లో జేఎమ్ఎమ్-కాంగ్రెస్- ఆర్జేడీ కూటమికి బలం పెరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ(జేవీఎం).. కూటమిలో చేరేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హేమంత్ మంగళవారం సాయంత్రం జేవీఎం చీఫ్ బాబూలాల్ మారాండీ ఇంటికి వెళ్లగా.. కూటమికి ఆయన తన మద్దతును ప్రకటించారు.