Sri Sri Ravi Shankar: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు రవిశంకర్‌కు తప్పినముప్పు.. తమిళనాడులోని సత్యమంగంళం ఫారెస్ట్‌లో చాపర్‌ ల్యాండింగ్‌

|

Jan 25, 2023 | 1:09 PM

వాతావరణం అనుకూలించకపోవడంతో చాపర్‌ను ల్యాండ్‌ చేశారు. ఈరోడ్జిల్లా సత్యమంగళం టైగర్ రిజర్వ్ పరిధిలోని కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో

Sri Sri Ravi Shankar: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు రవిశంకర్‌కు తప్పినముప్పు.. తమిళనాడులోని సత్యమంగంళం ఫారెస్ట్‌లో చాపర్‌ ల్యాండింగ్‌
Sri Sri Ravi Shankar
Follow us on

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీ శ్రీ రవిశంకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీ శీ రవిశంకర్‌ ప్రయాణం చేస్తున్న చాపర్‌ ఎమర్జెన్స ల్యాండింగ్‌ అయ్యింది. తమిళనాడు లోని ఈరోడ్‌ జిల్లా సత్యమంగంళం అటవీప్రాంతంలో చాపర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చాపర్‌ను ల్యాండ్‌ చేశారు. ఈరోడ్జిల్లా సత్యమంగళం టైగర్ రిజర్వ్ పరిధిలోని కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు ఉదయం సరిగ్గా 10.30 గంటలకు హెలికాప్టర్ అకస్మాత్తుగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ఒక్కసారిగా ల్యాండ్ కావడంతో ఆ ప్రాంత ప్రజలు అయోమయంలో పడ్డారు.

బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్లే హెలికాప్టర్‌లో ప్రతికూల వాతావరణం నెలకొంది. అలాగే దట్టమైన పొగమంచు కారణంగా మార్గం స్పష్టంగా లేకపోవడంతో హడావుడిగా ల్యాండింగ్ చేశారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సహా నలుగురు హెలికాప్టర్‌లో వెళ్లారు. 1 గంట పాటు అక్కడ వేచి ఉన్న తర్వాత వాతావరణం తేలికైన తర్వాత రవిశంకర్, అతని సహాయకులు ఉగినియం గ్రామం నుంచి తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం