Heavy Rains: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వరద బీభత్సం.. మహారాష్ట్రలో కుండపోత వర్షం..

దేశవ్యాప్తంగా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. గుజరాత్‌లో ఇంకా పలు జిల్లాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ , రాజస్థాన్‌లో కూడా కుండపోత వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థంగా మారింది.

Heavy Rains: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వరద బీభత్సం.. మహారాష్ట్రలో కుండపోత వర్షం..
Floods

Updated on: Jul 15, 2022 | 9:04 PM

గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 83 మంది ప్రాణాలు కోల్పోయారు. నవసరాయ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వల్సాద్‌,జామ్‌నగర్‌ , సూరత్‌ , అహ్మదాబాద్‌ , జునాఘడ్‌ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నవసరాయ్‌లో మనుషులనే కాదు.. మూగజీవాలను కాపాడుతున్నాయి ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు. జంతు ప్రేమికులు కూడా బోట్లలో వెళ్లి వరదలో చిక్కున్న ఆవులకు ., పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు.

చావును ఆహ్వానించడం అంటే ఇదే.. మహారాష్ట్ర లోని మాలేగావ్‌లో వరదల బీభత్సంలో స్టంట్‌ చేయబోయాడు ఓ యువకుడు. వరద ప్రవాహంలో ఎత్తైన బ్రిడ్జ్‌ నుంచి కిందకు జంప్‌ చేశాడు. ఒకేసారి వరద ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు నయీం అమీన్‌ అనే యువకుడు. ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

మాలేగావ్‌ వంతెన మీద చాలామంది నిలబడ్డారు. జోరువానలో అందర చూస్తుండగానే బ్రిడ్జ్‌ మీద నుంచి కిందకు జంప్‌ చేశాడు. నయీం అమీన్‌కు ఈత వచ్చు. క్షేమంగా బయటకు వస్తాడని అందరు భావించారు. కాని 24 గంటలు గడిచినప్పటికి నయీం అమీన్‌ జాడ చిక్కడం లేదు. గల్లంతైన నయీం కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 99 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్మదాపురం లోని తావా డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో 10 గేట్లను ఎత్తారు అధికారులు . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us