India Rains: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. 21 మంది మృతి..

|

Aug 20, 2022 | 9:19 PM

India Rains: ఉత్తరభారతంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌తో సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

India Rains: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. 21 మంది మృతి..
Andhra Rains
Follow us on

India Rains: ఉత్తరభారతంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌తో సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు ధ్వంసం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ధర్మశాల ప్రధాన రహదారిపై విరిగిపడిన కొండచరియలతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. భారీవర్షాలు, వరదలతో కాంగ్రా జిల్లాలో చక్కి వంతెన కూలిపోయింది. మండి జిల్లాలో ఆకస్మిక వరదలతో పలు గ్రామాలు నీటమునిగాయి. రహదారులపై భారీవరద ప్రవహిస్తోంది. ప్రధాన దారులన్నీ బురదమయంగా మారాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాల్‌, సదర్‌, తునాగ్, మండి, లమథాచ్‌ ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు చెబుతున్నారు అధికారులు. హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండీలో వరదల కారణంగా రైల్వే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లో పలుచోట్ల గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. డెహ్రాడూన్‌లో కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ఇళ్లు కుప్పకూలాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల పరిస్థితిని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..