IBPS Clerk: ‘బ్యాంకు జాబ్‌ కొట్టాలంటే ఎగ్జాంలో స్కోర్‌ సాధిస్తే సరిపోదు..’ కొత్త షరతు పెట్టిన ఐబీపీఎస్‌

|

Jul 06, 2023 | 3:42 PM

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 4,545 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు..

IBPS Clerk: బ్యాంకు జాబ్‌ కొట్టాలంటే ఎగ్జాంలో స్కోర్‌ సాధిస్తే సరిపోదు.. కొత్త షరతు పెట్టిన ఐబీపీఎస్‌
CIBIL score for IBPS jobs
Follow us on

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 4,545 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఐతే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా ఓ కొత్త నిబంధన చేర్చింది. అదేంటంటే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలతోపాటు సిబిల్‌ స్కోర్‌ కూడా ఉండాలని కొత్త షరతు పెట్టింది.

కనీసం 650 లేదా ఆపైన సిబిల్‌ స్కోర్‌ కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. అంటే దరఖాస్తు దారులు తమ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎటువంటి రుణం లేదన్నట్లు ‘నో అబ్జెక్షన్‌ ధ్రువపత్రం’ సమర్పించాలి. ఎవరైనా సిబిల్‌ స్కోర్‌ నమోదులో విఫలమైతే అటువంటి వారిని ఉద్యోగాలకు అనర్హులుగా భావిస్తామని వెల్లడించింది. కాగా జులై 21, 2023వ తేదీతో ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.