Delhi Air Pollution: మొన్నటిదాకా వర్షాలు.. ఇప్పుడు పొగ.. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఎయిర్​ పొల్యూషన్..

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలను కాల్చుతుండటంతో పొల్యూషన్​ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌..

Delhi Air Pollution: మొన్నటిదాకా వర్షాలు.. ఇప్పుడు పొగ.. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఎయిర్​ పొల్యూషన్..
Delhi Air Pollution

Updated on: Oct 18, 2022 | 9:07 PM

ల్లీలో మళ్లీ ఎయిర్​ పొల్యూషన్​ స్టార్ట్​ అయ్యింది. మొన్నటిదాకా వర్షాలు, మంచి గాలులతో కాస్త ఊపిరితీసుకున్న జనం..ఇప్పుడు మరోసారి డేంజర్​లో పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలను కాల్చుతుండటంతో పొల్యూషన్​ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 242కు చేరినట్లు ఢిల్లీ సీన్‌ చెబుతోంది. ఇది చాలా డేంజరస్​ అని, ఎయిర్​ పొల్యూషన్​ దెబ్బతింటోందని అంటున్నారు అధికారులు. దీనికితోడు దివాలీ వేళ క్రాకర్స్‌ నుంచి వచ్చే పొగతో పాటు శీతాకాలం ప్రారంభమవుతుండటంతో పొగమంచు మరింత టెన్షన్‌ పెడుతోంది. దీంతో నగరంలో కాలుష్య ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆప్ ప్రభుత్వం..పొల్యూషన్‌ కంట్రోల్‌కు చర్యలు చేపట్టింది.

అక్టోబర్ 25 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని..లేదంటే నిర్మొహమాటంగా పెట్రోల్, డీజిల్ నిరాకరించాలని నిబంధనలు విధిస్తోంది. మరోవైపు పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి రైతులకు బయో డీ కంపోజర్‌ను అందించాలని నిర్ణయించారు. ఢిల్లీ శివార్లలో 5000 ఎకరాల్లో బయోడికంపోజర్‌ను చల్లుతారని తెలిపారు. పంట వ్యర్థాల కాల్చివేతకు ప్రత్యామ్నాయంగా బయోడికంపోజర్‌ను వాడాలని చాలా రోజుల నుంచి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పంట వ్యర్థాల కాల్చివేతను అడ్డుకోవడానికి ఈ విధానాన్ని రూపొందించింది. పంజాబ్‌లో ప్రయోగాత్మకంగా బయో డీ కంపోజర్‌ను ఉపయోగించారు. దీంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని..డీకంపోజర్‌ను ఉపయోగించడానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఢిల్లీ ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం