‘మా తండ్రి ఆరోగ్యం మెరుగు పడింది’, ప్రణబ్ ముఖర్జీ కుమారుని వెల్లడి

తమ తండ్రి ఆరోగ్యం చాలావరకు మెరుగు పడిందని, నిలకడగా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ తెలిపారు. నిన్న తాను ఆసుపత్రిలో..

మా తండ్రి ఆరోగ్యం మెరుగు పడింది, ప్రణబ్ ముఖర్జీ కుమారుని వెల్లడి

Edited By:

Updated on: Aug 16, 2020 | 3:08 PM

తమ తండ్రి ఆరోగ్యం చాలావరకు మెరుగు పడిందని, నిలకడగా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ తెలిపారు. నిన్న తాను ఆసుపత్రిలో  ఆయనను సందర్శించానని, ఇదివరకటికన్నా ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని, ట్రీట్ మెంట్ కి ఆయన స్పందిస్తున్నారని అభిజిత్ ట్వీట్ చేశారు. త్వరలో ఆయన మన మధ్య ఉంటారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. కరోనా వైరస్ కి గురైన ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని ఆస్పత్రి వర్గాలు  నేటి బులెటిన్ లో తెలిపాయి.