అమ్మో..రూ.90 వేల చిల్లర నాణేలతో బైక్ కొన్నాడు

|

Mar 23, 2023 | 6:42 AM

ఈ కాలంలో చాలమంది చేతిలో నగదు ఉండటం లేదు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఎక్కువ మొత్తంలో ఆన్ లైన్ ట్రాన్సక్షన్సే జరుగుతున్నాయి.

అమ్మో..రూ.90 వేల చిల్లర నాణేలతో బైక్ కొన్నాడు
Coins
Follow us on

ఈ కాలంలో చాలమంది చేతిలో నగదు ఉండటం లేదు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ఎక్కువ మొత్తంలో ఆన్ లైన్ ట్రాన్సక్షన్సే జరుగుతున్నాయి. ఇక చిల్లర నాణేలు కూడా చాలామంది దగ్గర ఉండటం లేదు. కానీ అస్సాంలోని ఓ వ్యక్తి మొత్తం చిల్లర నాణేలతోనే ఓ ద్విచక్రవాహన్నాన్ని కొన్న విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే అస్సాంలోని దరంగ్ జిల్లా సిపజార్ లో మహమ్మద్ సైదుల్ హఖ్ ఉంటున్నాడు. బోరేగావ్ ప్రాంతంలోని చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సైదుల్ కు ఎప్పటినుంచో ఓ బైక్ ను కొనుక్కోవాలన్నది చిరకాల వాంఛ. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడి డబ్బులు పోగేశాడు. ఆ డబ్బులు కూడా నోట్లు కాదు. మొత్తం చిల్లర నాణేలే.

ఈ చిల్లర నాణేలను సైదుల్ హఖ్ ఐదారేళ్లుగా రోజు కొంచెం పొదుపు చేసుకుంటూ ఉన్నాడు. చివరికి ఈ నాణేలన్నింటిని ఓ బస్తాలో వేసుకొని బైక్ షోరూం కు చేరుకున్నాడు. దాదాపు 90 వేల చిల్లర నాణేలతో తాను ఎప్పటినుంచో కలలు గన్న ద్విచక్రవాహనాన్ని కొనుక్కొన్నాడు. అయితే 90 వేల చిల్లర నాణేలతో బైక్ షోరుంకి వచ్చిన సైదుల్ ను చూసి సిబ్బంది ఆశ్చర్యపోయినట్లు ఆ షోరుం యజమాని తెలిపారు. చివరికి తన బైకు ను తీసుకోని సంతోషంగా ఇంటికి వెళ్లాడు సైదుల్.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..