హాథ్రస్‌ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన గ్రామపెద్ద

|

Oct 07, 2020 | 4:11 PM

బీజేపీ నాయకుడు రంజిత్‌ బహదూర్‌ శ్రీవాత్సవ ఏ రకమైన మాటలు మాట్లాడారో ఇంచుమించు అలాగే మాట్లాడారు హాథ్రస్‌ గ్రామ పెద్ద! బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా..

హాథ్రస్‌ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన గ్రామపెద్ద
Follow us on

బీజేపీ నాయకుడు రంజిత్‌ బహదూర్‌ శ్రీవాత్సవ ఏ రకమైన మాటలు మాట్లాడారో ఇంచుమించు అలాగే మాట్లాడారు హాథ్రస్‌ గ్రామ పెద్ద! బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వారిద్దరు తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటుంటారని, ఇది తెలిసి బాధితురాలి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారని గ్రామపెద్ద తెలిపారు. బాధితురాలికి సెల్‌ఫోన్‌ కొనిచ్చిందే నిందితుడని అన్నారు. కుటుంబసభ్యులే బాధితురాలిని నానా హింస పెట్టారని అన్నాడు.. అసలు హిందూమతంలో ఎవరూ సామూహిక లైంగికదాడులకు పాల్పడరని చెప్పారు. నిందితులంతా నార్కో టెస్ట్‌కు రెడీగా ఉన్నారని, బాధితురాలి కుటుంబసభ్యులకు కూడా ఆ పరీక్షలను నిర్వహిస్తే దోషులెవరో తేలుతుందని తెలిపారు. ఆ అమ్మాయిని కలిసేందుకు నిందితుడు వచ్చినప్పుడు కుటుంబసభ్యులు కోపంతో ఆమెపై దాడికి దిగారని, ఆ కారణంగానే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని గ్రామపెద్ద తెలిపారు. బాధితురాలి కుటుంబానికి, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాంటున్నారు బీజేపీ నేత అమిత్‌ మాలవీయ. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటున్నామన్న సాకుతో చాలా మంది గ్రామంలో ఉన్నారని, దీనివల్ల శాంతిభద్రతలకు ముప్పు రావచ్చని గ్రామపెద్ద హాథ్రస్‌ ఎస్‌డీఎంకు తెలిపారు.