హత్రాస్ కేసులో ఇదో న్యూ ట్విస్ట్.. బాధితురాలికి, నలుగురు నిందితుల్లో ముఖ్యుడైన సందీప్ సింగ్ కి మధ్య 104ఫోన్ కాల్స్ నడిచాయట. వీరిద్దరి ఫోన్ కాల్స్ ని విశ్లేషించిన యూపీ పోలీసులు ఈ విషయం తెలిపారు. సందీప్ సింగ్ తో బాధిత యువతి సదా టచ్ లో ఉంటూ వచ్చిందని వారు చెప్పారు. పైగా ఆమె సోదరుడికి కూడా సందీప్ చాలాసార్లు ఫోన్ చేసినట్టు వెల్లడైందన్నారు. గత ఏడాది అక్టోబరు 13 నుంచి ఆ యువతికి, సందీప్ కి మధ్యా చాలా ఫోన్ సంభాషణలు జరిగాయన్నారు. 62 ఔట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్ కమింగ్ కాల్స్ నడిచినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అయితే హత్రాస్ కుటుంబ సభ్యుల్లో మరెవరికైనా ఈ విషయం తెలిసే ఉండవచ్ఛునని, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని వారు చెప్పారు.