Watch Video: రూ.50 టికెట్ కోసం కండక్టర్‌కు చుక్కలు చూపించిన లేడీ కానిస్టేబుల్..!

|

Oct 27, 2024 | 4:13 PM

హర్యానాకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఎక్కారు. దీంతో టికెట్ తీసుకోవాంటూ బస్ కండక్టర్ కోరారు.

Watch Video: రూ.50 టికెట్ కోసం కండక్టర్‌కు చుక్కలు చూపించిన లేడీ కానిస్టేబుల్..!
Haryana Police Constable
Follow us on

మీరు తరచుగా పోలీసులతో వాదించుకునే వ్యక్తులను చూసి ఉంటారు. పోలీసు స్టేషన్‌లో రాజకీయ నాయకులతో లేదా ప్రధాన రహదారిపై సాధారణ ప్రజలతో జరుగుతాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్.. బస్సు ప్రయాణంలో ఆర్టీసీ సిబ్బందితో వాగ్వివాదం చేస్తోంది. ఓ మహిళా కానిస్టేబుల్ బస్సు ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించింది. విశేషమేమిటంటే, ఆ మహిళ హర్యానా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ.. రాజస్థాన్ రోడ్‌వేస్‌లో కూర్చొని ఛార్జీలు చెల్లించడానికి ససేమిరా అంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ వీడియోలో, హర్యానాకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఎక్కారు. దీంతో టికెట్ తీసుకోవాంటూ బస్ కండక్టర్ కోరారు. సదరు కానిస్టేబుల్ బస్సు ఛార్జీని చెల్లించడానికి నిరాకరించింది. మహిళా పోలీసులు హర్యానా అర్టీసీలో ఫ్రీ ప్రయాణం ఉందని వారించింది. అయితే, ఇది హర్యానా రోడ్‌వేస్ కాదు, రాజస్థాన్ రోడ్‌వేస్ అని కండక్టర్ మొండిగా వాదించాడు. కానీ మహిళా కానిస్టేబుల్ చార్జ్ చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కండక్టర్‌ వాగ్వాదానికి దిగారు. మహిళ కానిస్టేబుల్‌కు తోటి ప్రయాణికులు సైతం టికెట్ తీసుకోవాలని కోరారు. కానీ ఆమె అంతే గట్టిగా టికెట్ తీసుకోవడానికి నిరాకరించారు. వాగ్వాదం సమయంలో కానిస్టేబుల్ బస్సు కండక్టర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం కనిపించింది. ఈ సమయంలో కండక్టర్ స్వయంగా ఆ మహిళను వీడియో తీశాడు.

వైరల్ వీడియోలో, మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీరు డబ్బు చెల్లించాలి అని కండక్టర్ మహిళతో గట్టిగా వాదించాడు. దీనిపై మహిళా కానిస్టేబుల్ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారని, హర్యానాలో మహిళా కానిస్టేబుల్‌కు ఉచిత ప్రయాణం ఉందని చెప్పారు. దీని తర్వాత కండక్టర్ ఇది రాజస్థాన్ రోడ్‌వేస్ అని, మీరు హర్యానా పోలీస్‌లో ఉన్నారని, దీనిపై లేడీ కానిస్టేబుల్ అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. బస్సు హర్యానాలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. దీని తరువాత, తోటి ప్రయాణీకులు మహిళకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ అర్థం చేసుకోవడానికి బదులుగా, ఆ మహిళ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. ఈ వీడియో ఘర్ కే కలేష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ‘X’ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 74 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. అయితే చాలా మంది వీడియోను లైక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోపై రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..