సోనియా ఓ “చచ్చిన ఎలుక”.. బీజేపీ సీఎం నోటి దురుసు

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హర్యానా సీఎం మనోహార్‌లాల్ ఖట్టర్.. మరోసారి తన నోటి దురుసుతనం బయట పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఓ “చచ్చిన ఎలుక” అంటూ వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి తెరలేపారు. ఖట్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన […]

సోనియా ఓ చచ్చిన ఎలుక.. బీజేపీ సీఎం నోటి దురుసు

Edited By:

Updated on: Oct 14, 2019 | 4:32 PM

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హర్యానా సీఎం మనోహార్‌లాల్ ఖట్టర్.. మరోసారి తన నోటి దురుసుతనం బయట పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఓ “చచ్చిన ఎలుక” అంటూ వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి తెరలేపారు. ఖట్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని.. అయితే ఆయన స్థానంలో గాంధీ యేతర కుటుంబం నుంచి అధ్యక్షులు వస్తారని.. రాహుల్ చెబుతూ వచ్చారని.. అది మంచి నిర్ణయం అని మేము అనుకున్నామన్నారు. కానీ నూతన అధ్యక్షుడి కోసం మూడు నెలల పాటు దేశమంతా గాలించారని.. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు సోనియాగాంధీని ఎన్నుకున్నారన్నారు. అది కూడా చచ్చిన ఎలుకను అంటూ ఖట్టర్ సంభోదించారు.

ఖట్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌ ఖాతా ద్వారా విరుచుకుపడింది. మహిళా నేతపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం.. ఆ పార్టీ తీరుకు అద్ధం పడుతోందని మండిపడింది. తక్షణం కట్టార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

అయితే ఖట్టార్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. జమ్ముకశ్మీర్‌ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఇంతకు ముందు బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునే వారమని, ఇప్పుడు కశ్మీర్ నుంచి కూడా తెచ్చుకోవచ్చని చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.