Harmohan Singh Yadav: దివంగత నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు హర్మోహన్‌సింగ్ యాదవ్ నేడు 10వ వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. హర్మోహన్‌సింగ్ పేద ప్రజలకు, రైతులకు, ఇతర వర్గాల వారికి ఎంతో కృషి చేశారని, అందుకు గుర్తింపుగా మోడీ ఆయన వర్థంతి కార్యక్రమంలో పాల్గొననున్నారని పీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. హర్మోహన్‌యాదవ్ భారత యాదవ్ సంఘం నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఎంతో కాలంగా భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేసిన అనుభవం. అంతేకాకుండా ఆయన కుమారుడు సుఖరామ్‌సింగ్ యావ్ ఎంపీగా పని చేశారు.
1921, అక్టోబర్ 18న కాన్పూర్‌లోని మెహర్బన్‌సింగ్ కా పూర్వా గ్రామంలో జన్మించిన హర్మోహన్‌సింగ్.. 31 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1952లో గ్రామ ప్రధాన్ పదవీని కూడా చేపట్టారు. అలాగే 1970-1990 వరకు ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పని చేశారు.1991లో ఆయన మొదటిసారిగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1997లో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇలా హర్మోహన్‌సింగ్ రకరకాల పదవులను చేపట్టి, పేద ప్రజలకు, రైతులకు ఎంతో కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా నేడు ప్రధాని ఆయన వర్థంతి వేడుకల్లో పాల్గొననున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి