Crime news: ప్రేమ పేరుతో లైంగిక దాడి.. మిత్రుల అవసరాలు తీర్చాలని ఒత్తిడి.. చివరకు

|

Apr 10, 2022 | 2:44 PM

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మాట్లాడుకుందామని పిలిచి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు. ఆపై తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. తన స్నేహితుల కోరికలు తీర్చాలని వేధించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక....

Crime news: ప్రేమ పేరుతో లైంగిక దాడి.. మిత్రుల అవసరాలు తీర్చాలని ఒత్తిడి.. చివరకు
Student Harassment
Follow us on

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మాట్లాడుకుందామని పిలిచి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు. ఆపై తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. తన స్నేహితుల కోరికలు తీర్చాలని వేధించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక.. ఇంట్లో వాళ్లకు విషయం వివరించింది. చివరికి వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక(Karnataka) లోని యలహంక(Yalahanka) శివార్లలో ఓ బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ యువకుడు బాలికను(Love) ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. మాట్లాడాలని చెప్పి యలహంకలోనే ఓ ఇంటికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆమెకు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. మరుసటి రోజు ఆమెకు వీడియో చూపించి, తన మిత్రుల అవసరాలు తీర్చాలంటూ బలవంతం చేశాడు. విధిలేని పరిస్థితిలో ఆ బాలిక కొంత డబ్బు సేకరించి వారికి అందించింది.

ఆపై లైంగిక వాంఛలు తీర్చాలంటూ పట్టుబట్టాడు. ఇలా వారం రోజులుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దయనీయ స్థితిలో ఇంటికి వచ్చిన బాలికను ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. ఏం జరిగిందని అడిగాక.. అసలు విషయం బయటపడింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు బాలురు ఉన్నారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read

Car Purchase: మీ పాత కారు మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Sri Rama Navami: కన్నుల పండువగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం.. పులకించిన భక్త జనం.. రేపు పట్టాభిషేకం

Viral Video: అమ్మా..! అస్సలు భయం లేకుండా పోయిందే.. గొర్రె పిల్లను బెదిరించిన కోడిపుంజు.. చివరకు..