మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అకస్మాత్తుగా గుజరాత్‌లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు.. అక్కడ ఉన్న అతిపెద్ద విగ్రహం “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” సందర్శించారు. దీనికి సంబంధిచిన ఫోటోలను దౌవెగౌడ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలను చూసిన ప్రధాని మోదీ.. రీ ట్వీట్ చేస్తూ.. స్పందించారు. కెవాడియాలో ఉన్న “స్టాట్యూ ఆఫ్ యూనిటీ”ని మాజీ ప్రధాని దేవెగౌడ సందర్శించడం సంతోషంగా ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. శనివారం రోజు కెవాడియా ప్రాంతంలో 182 మీటర్ల ఎత్తయిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చూసేందుకు దేవెగౌడ అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న మ్యూజియంను కూడా ఆయన సందర్శించి.. ఫోటోలు దిగారు.
ఈ “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దిగువన సాధు బెట్ వద్ద.. నర్మదా నదిపై నిర్మించారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే గతేడాది అక్టోబర్‌లో పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 23 లక్షలకు పైగా సందర్శించారు.
Happy to see our former PM Shri @H_D_Devegowda Ji visit the ‘Statue of Unity.’ https://t.co/GVWMo7UIow
— Narendra Modi (@narendramodi) October 6, 2019