Odisha: సముద్ర తీరంలో సంతోషంగా తండ్రి కొడుకులు ఆటలు.. అలల తాకిడికి అంతలోనే విషాదం..

|

Apr 17, 2022 | 8:11 PM

Odisha: ఒడిశాలోని పూరీ తీరంలో ( Puri beach) విషాద ఘటన చోటు చేసుకుంది. సముద్రం తీరంలో తనయుడితో సంతోషంగా ఆడుకుంటున్న తండ్రి.. అలల తాకిడికి ( sneaker wave) కొట్టుకుపోయాడు..

Odisha: సముద్ర తీరంలో సంతోషంగా తండ్రి కొడుకులు ఆటలు.. అలల తాకిడికి అంతలోనే విషాదం..
Odisha S Puri
Follow us on

Odisha: ఒడిశాలోని పూరీ తీరంలో ( Puri beach) విషాద ఘటన చోటు చేసుకుంది. సముద్రం తీరంలో తనయుడితో సంతోషంగా ఆడుకుంటున్న తండ్రి.. అలల తాకిడికి ( sneaker wave) కొట్టుకుపోయాడు. తండ్రి సముద్రంలోకి కొట్టుకుని పోతుంటే నిస్సహాయుదిగా కుమారుడు మిలిగిలాడు. మృతుడు బాలాసోర్‌కు చెందిన బన్సీధర్ బెహరగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..

బన్సీధర్ బెహర తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు పూరీకి వచ్చారు. ముందుగా జగన్నాథ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. అనంతరం కొడుకు తో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు పూరీ బీచ్‌కి వెళ్లారు. బాధితుడు తన కుమారుడితో కలిసి అలల్లో ఉల్లాసంగా ఉల్లాసంగా ఉండగా, అకస్మాత్తుగా అలలు ఈడ్చుకెళ్లాయి. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు కాగా.. ఇద్దరినీ లైఫ్ గార్ధులు రక్షించారు.ఘటనకు సంబంధించిన దృశ్యాలను బీచ్ ఒడ్డున ఉన్న అతడి బంధువు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ వీడియోలో బెహరసముద్రం వైపు పరుగెత్తడం, నీటిలోకి దూకడం చూపుతుంది. నిమిషాల వ్యవధిలోనే అతడు కనిపించకుండా పోయాడు. లైఫ్ గార్డులు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగారు. వారు జార్ఖండ్‌కు చెందిన మరో ఇద్దరు పర్యాటకులను రక్షించగలిగినప్పటికీ, వారు బెహెరాను రక్షించలేకపోయారు. జార్ఖండ్‌కు చెందిన పర్యాటకులను నిశాంత్ గోయల్, హిమాన్షు కుమార్‌లుగా గుర్తించారు.

Read Also :

Bhopal: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింల పూల వర్షం.. జై హ‌నుమాన్ అంటూ నినాదాలు..