గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది 182 సీట్లలో బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. 68 సీట్లలో కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.
గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత గుజరాత్‌లో ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని తేలిపోనుంది. 182 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలో ఉన్న గుజరాత్‌లోని 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 , డిసెంబర్ 5 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో ఈ ఏడాది 66.31 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2017 అసెంబ్లీ ఎన్నికలలో 71.28 శాతం ఓటింగ్ కంటే తక్కువ. తొలి దశలో 60.20 శాతం ఓటింగ్ జరగగా, రెండో దశలో 64.39 శాతం ఓటింగ్ జరిగింది.
గుజరాత్‌లో సంప్రదాయబద్ధంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ జరుగుతుంది. అయితే, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రంగంలోకి దిగడంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, గుజరాత్ ఎన్నికల్లో బిజెపి మళ్లీ గెలుస్తుంది. బిజెపికి 2017 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. గుజరాత్‌లో బీజేపీ 110 నుంచి 125 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 99 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 45 నుంచి 60 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, 2017లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 1 నుంచి 5 సీట్లు గెలుచుకుంటుంది. 2017తో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద విషయమే. ఎందుకంటే 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో ఆమ్ ఆద్మీ పార్టీకి 0.10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
గుజరాత్ ను బీజేపీ గత 27 ఏళ్లుగా పాలిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఆప్ సైతం పార్టిసిపేట్ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అటుంచితే.. ఏయే పార్టీకి ఎన్నేసి స్థానాలొస్తాయి. ఆప్ ఎంట్రీతో ఎలాంటి స్థానాలు ఏయే పార్టీలు చేయి జారనున్నాయి? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాల్లో బీజేపీ (బీజేపీ), కాంగ్రెస్ (కాంగ్రెస్) పోటీ చేశాయి. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 67 స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. మొత్తం 68 స్థానాలున్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం పొందాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరీ పోరు జరిగిందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఆప్ గట్టి పోటీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇక రెండు ప్రధాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు సైతం ఉత్కంఠ రేపుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లో గత సంప్రదాయం కొనసాగనుందా? లేక బీజేపీ మరోమారు అధికారం సొంతం చేసుకోనుందా? లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అన్న సస్పెన్స్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. 68 సీట్లలో కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.
గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది 182 సీట్లలో బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.
గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైనా జాతీయ పార్టీగా అవతరించినందుకు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆప్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
राष्ट्रीय पार्टी बनने पर आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं और सभी देशवासियों को बधाई। pic.twitter.com/sba9Q1sz1f
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2022
గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 16, ఆప్ 4, ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో ఘనవిజయంపై హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో అపశ్రుతి దొర్లింది. కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సమయంలో నిప్పు రవ్వలు ఎగిరిపడి ఫ్లెక్సీలు తగులబడ్డాయి, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రధాని నరేంద్రమోడీపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం వల్లే గుజరాత్‌లో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత రికార్డులను బద్దలు కొడుతూ బీజేపీ వరుసగా ఏడోసారి ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం.. చారిత్రక విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
గుజరాత్‌లో బీజేపీని మరోసారి అధికారంలో తీసుకురావడంపై రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్.. ఎప్పుడూ చరిత్ర సృష్టించే పనులే చేసిందంటూ ట్విట్ చేశారు.
इस ऐतिहासिक जीत पर गुजरात की जनता को नमन करता हूँ।
प्रधानमंत्री @narendramodi जी के नेतृत्व और @JPNadda जी की अध्यक्षता में मिली इस भव्य जीत पर मुख्यमंत्री @Bhupendrapbjp जी, प्रदेश अध्यक्ष @CRPaatil जी और अथक परिश्रम करने वाले @BJP4Gujarat के सभी कार्यकर्ताओं को बधाई।
— Amit Shah (@AmitShah) December 8, 2022
గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఈసారి బీజేపీకి కష్టమే అనుకున్న విశ్లేషణలు రివర్స్ అయ్యాయి. రూరల్‌లో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ ఉందని, అర్బన్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ బీజేపీని దెబ్బకొడుతుందని అంతా భావించారు. ఫలితాలు చూస్తే బీజేపీకి రికార్డు మెజార్టీ దక్కింది. ఏకంగా 156 స్థానాల్లో బీజేపీ సత్తా చాటగా, కేవలం 17 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. ఆమ్‌ఆద్మీ ఐదు స్థానాలు దక్కుతున్నాయి.
మంచుకొండల్లో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి. ఎస్, హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ ఫైట్‌లో కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. మేజిక్ ఫిగర్‌ని దాటింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లుండగా.. కాంగ్రెస్ 39 స్థానాల్లో సత్తా చాటింది. అధికార బీజేపీ 26 సీట్లకు పరిమితమైంది. ఆమ్‌ఆద్మీ పార్టీ అక్కడ ఖాతా తెరవలేదు. ఇతరులు మూడు స్థానాల్లో సత్తా చాటారు.
హిమాచల్ ప్రదేశ్ ట్రెండ్స్ మధ్య కాంగ్రెస్ లో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు ప్రియాంక గాంధీ, సోనియాగాంధీ రాజస్థాన్ చేరుకున్నారు. మరోవైపు హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, రాజీవ్ శుక్లా హిమాచల్‌ప్రదేశ్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ పోకడలను బట్టి చూస్తే రెండు పార్టీల ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ముందుకెళ్లింది. బీజేపీకి 43.06 శాతం, కాంగ్రెస్‌కు 43.77 శాతం ఓట్లు వచ్చాయి.
గుజరాత్‌లోని విరామ్‌గాం స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన హార్దిక్ పటేల్ 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఘట్లోడియా స్థానం నుంచి గెలుపొందారు. భూపేంద్ర పటేల్ ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.
గుజరాత్‌లో బీజేపీ రికార్డ్ విజయం దిశగా దూసుకుపోతుండటంతో సంబరాలు అంబరాన్నంటాయి. కమలం పార్టీ శ్రేణులు హడావుడి చేస్తున్నారు. బాణసంచా పేల్చి నృత్యాలు చేస్తున్నారు కార్యకర్తలు.
గుజరాత్ గట్లోదియాలో సీఎం భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. దీంతో రెండోసారి సీఎంగా భూపేంద్రపటేల్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 10 లేదా 11న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా. ఇక సాయంత్రం బీజేపీ కార్యాలయానికి రానున్నారు ప్రధాని మోదీ. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రికార్డు విజయం దిశగా దూసుకుపోతోంది. కాగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం డిసెంబర్ 11న జరగవచ్చని, ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకావచ్చని వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.
గుజరాత్‌లో బీజేపీ నుంచి బరిలో ఉన్న పలువురు ప్రముఖులు గెలుపు దిశంలో ఉన్నారు జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా 12 వేల లీడ్‌లో ఉన్నారు. సీఎం భూపేంద్రపేటల్ అహ్మదాబాద్ లోని గట్లోదియా స్థానం నుంచి 26 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. వీరమ్‌గమ్ నుంచి 20 వేల ఓట్లలీడ్‌లో ఉన్నారు హార్ధిక్ పటేల్..
గుజరాత్ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘెర పరాభవం ఎదురమైంది. ఆప్ దెబ్బకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావడంతో హస్తం పార్టీ 20 స్థానాలకు పరిమితం అయ్యేట్టే కనిపిస్తోంది. అటు గుజరాత్‌లో ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉనికిని చాటుకుంది.
గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. అలా ఇలా కాదు.. ఇది సూపర్ బంపర్ విక్టరీ. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి పడ్డాయి.. ఈ దెబ్బకు కాంగ్రెస్ కకావిలకం అయ్యింది.
గుజరాత్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలోనూ గుజరాత్ తరహా ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. గుజరాత్‌లో మిగతా పార్టీలన్నీ ఒక్కటైనా బీజేపీ గెలుపు ఆపలేకపోయాయనన్నారు. గుజరాత్‌కు తెలంగాణ సీఎం డబ్బులు పంపారనా బీజేపీ గెలుపును ఆపలేకపోయారని విమర్శించారు. గుజరాత్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని.. తెలంగాణలోనూ గుజరాత్ తరహా ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు బండి సంజయ్.
ట్రెండ్స్‌లో కాంగ్రెస్ మెజారిటీ మార్కును దాటేసింది. బీజేపీ 27, కాంగ్రెస్ 38, ఇతర అభ్యర్థులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. బీజేపీ అభివృద్ధి రాజకీయాలను నమ్ముతోందన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ సూత్రంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అననారు. గుజరాత్‌లో వస్తున్న మార్పులు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూల విధానాల ఫలితమేనని అన్నారు.
బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూస్తే కేసీఆర్‌కు నిద్రపట్టదని ఎద్దేవ చేసిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. గుజరాత్ ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలకు ట్రయల్ మాత్రమే అని.. 2019లో 303 సీట్లు సాధించిన తాము, 2024లో 404 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అతిశయోక్తిలా ఉన్నా జరగబోయేది ఇదే అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రో-డెవలప్మెంట్ పాలిటిక్స్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు ఎంపీ జీవీల్.
హిమాచల్ ప్రదేశ్ ట్రెండ్స్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ 34, బీజేపీ 31, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విరామ్‌గాం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ 3099 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గాంధీనగర్ సౌత్ సీటులో ఐదు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ 4130 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గతంలోకంటే 50 సీట్లు కోల్పోనున్న కాంగ్రెస్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ మార్కును దాటింది. 140 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రెండో రౌండ్ ముగిసేసరికి 8671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లోని 16 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (బిజెపి) 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పాటు రాజ్‌కోట్‌లోని మొత్తం 8 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, గాంధీనగర్‌లోని మొత్తం 5 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
గుజరాత్‌లో అసెంబ్లీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) పయనిస్తోంది. ఆ పార్టీ 150+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుజరాత్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న రికార్డు కాంగ్రెస్ పేరిట ఉందని, 1985లో ఆ పార్టీ 149 సీట్లను కైవసం చేసుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ట్రెండ్స్‌లో ద్వారకా జిల్లాలోని ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు,ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వి ఆధిక్యంలో ఉన్నారు. 2 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ఇసుదన్ గధ్వి 3215 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. గుజరాత్‌లో బిజెపికి మెజారిటీ వచ్చింది. గుజరాత్ బిజెపి ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ సాధించింది. రెండో రౌండ్ ముగిసే సమయానికి సీఎం భూపేంద్ర పటేల్ 13,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ విధానసభ ఎన్నికల ఫలితాల్లో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి ముందంజలో ఉన్నారు.
బీజేపీ రికార్డును బద్దలు కొడుతుందని గుజరాత్ ప్రభుత్వ మంత్రి, సూరత్ వెస్ట్ బీజేపీ అభ్యర్థి పూర్ణేష్ మోదీ అన్నారు. ఇది గరిష్ట సీట్లుతోపాటు అత్యధిక ఓట్ల శాతాన్ని పొందుతుందన్నారు. మా అభ్యర్థులందరూ తమ ప్రత్యర్థి అభ్యర్థుల కంటే భారీ మెజార్టీతో ముందంజలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ భారీ విజయం సాధిస్తుందన్నారు.
హిమాచల్ ప్రదేశ్ తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ముందుంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో అభ్యర్థి 1 స్థానంలో ముందంజలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ తొలి ట్రెండ్స్‌లో సీఎం జైరామ్ ఠాకూర్ ముందున్నారు. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ మెజారిటీ సాధించింది. బీజేపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ట్రెండ్స్‌లో బీజేపీ 31 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ట్రెండ్స్‌లో కాంగ్రెస్ మెజారిటీకి చేరువైంది. కాంగ్రెస్ 33, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌లో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. కాంగ్రెస్ 28, బీజేపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి హార్దిక్ పటేల్ విరామ్‌గామ్ నుంచి ముందంజలో ఉన్నారు.
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్‌లలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ సంఖ్యను సాధించింది. అయితే విరామ్‌గామ్ అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి హార్దిక్ పటేల్ వెనుకంజలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు ముందస్తు ట్రెండ్‌లు బయటపడ్డాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ట్రెండ్‌లలో చాలా లాభపడింది. బీజేపీ 127 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 3, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 3, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
గుజరాత్‌లో వరుసగా ఏడోసారి అధికారం దిశగా బీజేపీ. తొలి ఫలితాల్లో 130కిపైగా స్థానాల్లో బీజేపీకి ఆధిక్యం. వీరంగామ్‌లో బీజేపీ నేత హార్ధిక్ పటేల్ వెనుకంజ. గాంధీనగర్ సౌత్‌లో అల్పేష్ ఠాకూర్ మళ్లీ ముందంజలోకి వచ్చారు. జామ్‌నగర్ నార్త్‌లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివావా వెనుకంజ. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాఢ్వీ వెనుకంజ. గుజరాత్‌లో ప్రభావం చూపని ఆప్.. సింగిల్ డిజిట్‌కి పరిమితం. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
హిమాచల్ ప్రదేశ్‌లో 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీసు కాపలా ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధిక్యంలో ఉంది. బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 7, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
గుజరాత్ శాసనసభ మొదటి పోకడలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి అనుకూలంగా వచ్చాయి. ఆ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. టీవీ 9 వెబ్‌సైట్‌లో మీరు మొదట చూడగలిగేలా.. గుజరాత్ ఎన్నికల ట్రెండ్‌లు కొద్దిసేపటిలో రావడం ప్రారంభమవుతాయి.
కాసేపట్లో హిమాచల్ ప్రదేశ్ ట్రెండ్స్ మొదలవుతాయి. బ్యాలెట్ పేపర్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలను తెరిచి ఓట్లను లెక్కించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సిమ్లాలోని ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లడం కనిపించింది.
Shimla, HP | Counting of votes for Himachal Pradesh assembly elections will begin at 8 am. Outside visuals from counting centre, Government Girls Senior Secondary School pic.twitter.com/oNntMmLbG7
— ANI (@ANI) December 8, 2022
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, యువనేతలు హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకోర్ సహా మొత్తం 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 70 రాజకీయ పార్టీలు, 624 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందు బుధవారం సిమ్లాలోని ప్రసిద్ధ రిడ్జ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ‘గొల్గప్పే’ తింటూ కనిపించారు. ఆయనతో పాటు బీజేపీ హిమాచల్ ప్రదేశ్ సంస్థాగత కార్యదర్శి పవన్ రాణా, సిమ్లా (అర్బన్) నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్, ఎన్నికల కో-ఇంఛార్జి దేవేంద్ర సింగ్ రాణా కూడా ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మళ్లీ విజయం సాధించి వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో బీజేపీకి 2017 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. టీవీ9 సర్వేలో గుజరాత్‌లో బీజేపీ 125 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 99 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 45 నుంచి 60 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, 2017లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 1 నుండి 5 సీట్లు గెలుచుకుంటుంది. 2017తో పోలిస్తే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద విషయమే, ఎందుకంటే 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైంది. 2017లో ఆమ్ ఆద్మీ పార్టీకి 0.10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 20-25, ఆప్‌కి 0-3, ఇతరులకు 1-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీకి 35 సీట్లు కావాలి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 1న జరిగిన తొలి విడతలో దాదాపు 60.20 శాతం ఓటింగ్ జరగగా, డిసెంబర్ 5న జరిగిన రెండో దశలో 64.39 శాతం ఓటింగ్ జరిగింది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలను తెరుస్తారు.
గుజరాత్‌లో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 37 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే, గుజరాత్‌లోని 182 అసెంబ్లీలోని ఒక్కో ఓటును 37 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కించి, ఆ తర్వాతే ఈసారి గుజరాత్‌లో ఎవరి ప్రభుత్వం ఉంటుందో తేల్చనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలను తెరుస్తారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీని కోసం 10 వేల మంది సిబ్బందిని నియమించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత గుజరాత్‌లో ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని తేలిపోనుంది.