Cyclone Taukte: తుఫాన్ ఎఫెక్ట్.. పేకమేడలా కూలిపోయిన ఐదంతస్థుల భవనం.. వీడియో

| Edited By: Rajeev Rayala

May 20, 2021 | 6:35 AM

Five-storey building collapsed in Jamalpur: దేశంలోని పలు ప్రాంతాల్లో గ‌త రెండు రోజులుగా తౌటే త‌ఫాను అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుఫాను కార‌ణంగా

Cyclone Taukte: తుఫాన్ ఎఫెక్ట్.. పేకమేడలా కూలిపోయిన ఐదంతస్థుల భవనం.. వీడియో
Five Storey Building Collapsed In Jamalpur
Follow us on

Five-storey building collapsed in Jamalpur: దేశంలోని పలు ప్రాంతాల్లో గ‌త రెండు రోజులుగా తౌక్టే త‌ఫాను అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుఫాను కార‌ణంగా గుజ‌రాత్‌లోని ప‌లు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో అహ్మ‌దాబాద్‌ జమాల్పూర్ ప్రాంతంలో బుధవారం ఓ ఐదంత‌స్థుల‌ భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘ‌ట‌న జరగ‌డానికి ముందే నివాసితులంతా బయటికి వెళ్లిపోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యిందని జమాల్‌పూర్ ఈ డివిజన్ ఏసీసీ సాగర్ సంబడా తెలిపారు.

తౌక్టే తుఫాను కారణంగా బలమైన గాలుల వీయ‌డంతో జ‌మాల్పూర్‌లోని భవనం కూలిపోయిందని తెలిపారు. ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో భ‌వ‌నం మొత్తం నానిపోయి కూలిపోయేందుకు సిద్ధ‌మైంద‌ని.. ఈ విషయాన్ని నివాసం ఉండే వారు ముందస్తుగా గుర్తించారన్నారు. దీంతో భ‌వ‌నంలో నివ‌సిస్తున్న అంద‌రినీ బ‌య‌ట‌కు తరలించారు. అంద‌రూ బ‌య‌ట‌కు వెళ్లిన కొద్దిసేప‌టికే భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. అయితే.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో..

కాగా తౌక్టే తుఫాను కారణంగా.. గుజరాత్‌లో భారీ నష్టం సంభవించింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని డియూ, ఉనా పట్టణం మధ్య మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ రాకాసి తుఫాను కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు ఇవే..! ఒక్కో స్టేషన్‌కి ఒక్కో చరిత్ర.. తెలుసుకోండి..

రైలు చివరన X అని ఎందుకు రాస్తారు..! చిన్న బోర్డుపై ఉండే LV అక్షరాల అర్థం ఏంటి..? తెలుసుకోండి..