గుజరాత్ సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రఘుబీర్ టెక్స్‌టైల్స్ 10 అంతస్తుల భవనంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో.. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు వందల మంది, 57 ఫైర్ ఇంజన్‌లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావటం లేదు. భారీ అగ్నిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Gujarat: Latest visuals from Raghuveer Market in Surat where fire broke out, earlier today. Fire under control, cooling operation underway. pic.twitter.com/NuWrRR1Icl
— ANI (@ANI) January 21, 2020