Mines Auction: సంచలన నిర్ణయం.. మార్కెట్‌లో వేలానికి 100 గనులు.. కారణమిదే.!

|

Sep 08, 2021 | 6:01 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్మనిర్భర్ భారత్‌ సాకారమే లక్ష్యంగా 100 ఖనిజాల బ్లాక్‌లను వేలానికి పెట్టింది. ఇందుకు..

Mines Auction: సంచలన నిర్ణయం.. మార్కెట్‌లో వేలానికి 100 గనులు.. కారణమిదే.!
Gsi
Follow us on

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్మనిర్భర్ భారత్‌ సాకారమే లక్ష్యంగా గనులను వేలం వేస్తోంది. ఇందుకోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 100 జీ4 ఖనిజాల బ్లాక్‌లను వేలానికి పెట్టింది. ఈ కార్యక్రమం ఇవాళ ఢిల్లీలో జరుగుతోంది. కేంద్రమంత్రులు ప్రహ్లద్ జోషి, రావు సాహెబ్ పటేల్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎంఎండీఆర్ సవరణ చట్టం 2015 ప్రోస్పెక్టింగ్ లైసెన్స్, మైనింగ్ లీజుల పరంగా ఖనిజ రాయితీల కేటాయింపులో ఇది పారదర్శకతకు నాంది పలుకుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 2021లో సవరించింది. ఈ సవరణల వల్ల మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా రాష్ట్రాలకు ఉత్పత్తి పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరగనుంది.

ఇక జీఎస్ఐ వేలానికి పెట్టిన 100 గనులకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం వల్ల దేశంలో ఖనిజాల సరఫరా మరింత పెరుగుతోంది. వీటి వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. కాగా, ఇటీవల ఖనిజ నిక్షేపాల గుర్తింపు తగ్గిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనితో కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు హామీ ఇచ్చింది. మైనింగ్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు తగిన ప్రాధ్యానత ఇస్తోంది.