భారత దేశమా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం.. తాజా అధ్యయనం

|

Dec 22, 2024 | 1:42 PM

ఐఎస్ఎఫ్ఆర్ తాజా రిపోర్టు ప్రకారం.. దేశంలో మొత్తం గ్రీన‌రీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్న‌ట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలిసింది. కార్బ‌న్ వ్య‌ర్థాల‌ను 2.29 బిలియ‌న్ ట‌న్నులు త‌గ్గించిన‌ట్లు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. అద‌నంగా మ‌రో మూడు బిలియ‌న్ల ట‌న్నుల కార్బ‌న్‌ను 2030 నాటికి త‌గ్గించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు.

భారత దేశమా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం.. తాజా అధ్యయనం
Green Cover Rises
Follow us on

దేశంలో హరితహారం పరిధి పెరిగింది. గ‌డిచిన మూడేళ్ల‌లో అడవులు, చెట్ల విస్తీర్ణం సుమారు 1,445 చదరపు కిలోమీటర్ల మేర పెరిగినట్టుగా తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది 2021 కంటే 0.17 శాతం ఎక్కువగా నమోదైంది. డెహ్రాడూన్‌లోని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌(ఐఎస్ఎఫ్ఆర్)లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ మేరకు శనివారం ఇండియా ఫారెస్ట్ స్టేటస్ రిపోర్ట్-2023ని విడుదల చేశారు.

ఐఎస్ఎఫ్ఆర్ తాజా రిపోర్టు ప్రకారం.. దేశంలో మొత్తం గ్రీన‌రీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్న‌ట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలిసింది. కార్బ‌న్ వ్య‌ర్థాల‌ను 2.29 బిలియ‌న్ ట‌న్నులు త‌గ్గించిన‌ట్లు ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. అద‌నంగా మ‌రో మూడు బిలియ‌న్ల ట‌న్నుల కార్బ‌న్‌ను 2030 నాటికి త‌గ్గించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు.

నివేదిక ప్రకారం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్‌లలో అడవులు, చెట్ల విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుకుంటే అడవులు, చెట్లతో కూడిన విస్తీర్ణం తగ్గిపోయిందని వెల్లడించింది. 2021లో 7,13,789 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు ఉన్న అట‌వీ విస్తీర్ణం .. 2023లో 7,15,343 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు పెరిగింద‌ని నివేదిక‌లో తెలిపారు. చెట్ల విస్తీర్ణం 1289 కిలోమీట‌ర్ల పెరిగిన‌ట్లు నివేదిక‌లో వివరించారు.

ఇవి కూడా చదవండి

పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడానికి దాని వాతావరణ ప్రణాళికలు, జాతీయంగా నిర్ణయించిన సహకారం (NDCలు)లో భాగంగా, 2030 నాటికి అదనంగా అడవుల విస్తీర్ణం 2.5 వరకు పెంచాలని, దీంతో 3 బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింక్‌ను త‌గ్గించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..