రాజస్తాన్…’గవర్నర్ లవ్ లెటర్ పంపారు’… మండిపడిన అశోక్ గెహ్లాట్

అసెంబ్లీని సమావేశపరచాలన్న తన అభ్యర్థనను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా తిరస్కరించడంపై రాజస్తాన్  సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడుతున్నారు. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం కోరినప్పుడు ఆ కోర్కెను  గవర్నర్ అంగీకరించాల్సి..

రాజస్తాన్...గవర్నర్ లవ్ లెటర్ పంపారు... మండిపడిన అశోక్ గెహ్లాట్

Edited By:

Updated on: Jul 27, 2020 | 4:20 PM

అసెంబ్లీని సమావేశపరచాలన్న తన అభ్యర్థనను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా తిరస్కరించడంపై రాజస్తాన్  సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడుతున్నారు. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం కోరినప్పుడు ఆ కోర్కెను  గవర్నర్ అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఆయన తీరుపై తాను నిన్న ప్రధానికి వివరించాననితెలిపారు. తనకు  గవర్నర్  ఆరు పేజీల ‘లవ్ లెటర్’ పంపారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శాసన సభను సమావేశపరచాలని ఒక ముఖ్యమంత్రి కోరితే తిరస్కరించడం 70 ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటిసారని గెహ్లాట్ అన్నారు. ఈ సందర్భంగా….. మీడియాలో ఆచార్య అనే వ్యాసకర్త రాసిన ఓ ఆర్టికల్ గురించి ఆయన ప్రస్తావించారు.

ఇలా ఉండగా బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తూ..అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిగితే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించారు. ఈ ఎమ్మెల్యేలు గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ..మీరు కాంగ్రెస్ లో విలీనం అయినట్టు కాదని బీఎస్పీ నిన్న వారికి స్పష్టం చేసింది. మీరు బహుజన్  సమాజ్ పార్టీకి చెందినవారే అని ప్రకటించింది. అటు-రాష్ట్రంలోని తాజా పరిణామాలను అసమ్మతి నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, బీజేపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు.