
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 16, శుక్రవారం ఒక్కరోజులోనే 242 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్ లింకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 7,800కు పైగా అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లు దేశవ్యాప్తంగా గుర్తించి టేక్‌డౌన్ చేశారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.
ఈ అక్రమ వెబ్‌సైట్లు ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపిస్తూ వారిని వ్యసనాల బాట పట్టిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తాజాగా తీసుకున్న చర్యలు వినియోగదారుల భద్రతను కాపాడడం కోసమేనని ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. యువతను ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడకుండా చేయడం, అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా మరింత అగ్రెసీవ్‌గా ముందుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో కూడా అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలపై నిరంతర నిఘా, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Government of India today blocked 242 illegal betting and gambling website links. So far, over 7,800 illegal betting and gambling websites have been taken down, with a significant increase in enforcement actions after the passage of the Online Gaming Act. Today’s action reflects… pic.twitter.com/QcrPewcLxZ
— ANI (@ANI) January 16, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.