Bitcoin ban in india: బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారా..? అయితో మీకో షాకింగ్ న్యూస్.. త్వరలో బ్యాన్..!

|

Jan 30, 2021 | 7:22 PM

ఇండియాలో జనాలు ఇటీవలి కాలంలో బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారు. కొంతమంది బాగానే రిటర్న్స్ పొందారు. కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్ 30 లక్షల రూపాయల మార్క్‌ను రీచ్ అయ్యింది. 

Bitcoin ban in india: బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారా..? అయితో మీకో షాకింగ్ న్యూస్.. త్వరలో బ్యాన్..!
Bitcoin
Follow us on

Bitcoin ban in india: ఇండియాలో జనాలు ఇటీవలి కాలంలో బిట్ కాయిన్‌లో బాగా పెట్టుబడులు పెడుతున్నారు. కొంతమంది బాగానే రిటర్న్స్ పొందారు. కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్ 30 లక్షల రూపాయల మార్క్‌ను రీచ్ అయ్యింది. అయితే తాజాగా అందుతోన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇండియా గవర్నమెంట్ బిట్‌కాయిన్‌ను బ్యాన్ చేయాలని ఫిక్సయినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బిట్ కాయిన్ దాదాపు రూ. 24 లక్షల రూపాయల మధ్య ట్రేడవుతోంది. అయితే దీని రేటు ఎప్పుడు గగనానికి దూసుకుపోతుందో.. ఎప్పుడూ నేలకు జారిపోతుందో చెప్పడానికి లేదు. తేడా వస్తే భారీ నష్టాలు తప్పవు. అందుకు ఈ కరెన్సీకి కళ్లెం వేయాలని మోదీ సర్కార్ ప్రణాళికలు రూపొందించిందట.

క్రిప్టోకరెన్సీపై నిషేధం దిశగా భారత ప్రభుత్వం ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ , 2021’పేరుతో రూపొందించిన  బిల్లు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రైవేట్ వాటికి బదులు కేంద్రమే ప్రభుత్వం  అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ పనులను కూడా ప్రారంభించిందట. ప్రస్తుతం భారత్‌లో బిట్‌కాయిన్‌తో పాటూ ఇథెర్ , రిపుల్ వంటి క్రిప్టో కరెన్సీలు చాలా వచ్చాయి. తాజా బిల్లుతో  ఇవన్నీ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read:

Inter Practical Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త.. ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు

Eating Late and Weight Gain: రాత్రి 8 తర్వాత తీసుకునే ఆహారం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి తెలుసా..!