Inter Practical Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త.. ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు
కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం అంతా డిస్టర్బ్ అయ్యింది. కళాశాలల పనిదినాలను కుదించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం

Inter Practical Exams: కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం అంతా డిస్టర్బ్ అయ్యింది. కళాశాలల పనిదినాలను కుదించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అనౌన్స్ చేసింది. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ లో ఉంచినట్లు వివరించింది.
పదో తరగతి పరీక్షలు :
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు నమూనా షెడ్యూల్‌ను రూపొందించారు. అయితే దీనిపై ప్రభుత్వం ఫైనల్‌గా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అనంతరం అధికారికంగా షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తారు.
అయితే.. నమూనా షెడ్యూల్ నుంచి అందుతోన్న సమాచారం మేరకు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే కోవిడ్ కారణంగా ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 7 పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. ఇందులో సైన్సుకు రెండు పేపర్లు.. మిగిలిన 5 సబ్జెక్ట్‌లకు 5 పేపర్లుంటాయి.
Also Read:
Honor V40 5G: ఆనర్ నుంచి అద్భుతమైన ఫీచర్స్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ‘ఆనర్‌వి40 5జీ మొబైల్
Tv9 Sweet Home: సొంతిల్లు మీ కలా… అయితే టీవీ9 మీకోసం ఒక సువర్ణవకాశాన్ని అందిస్తోంది..