గాంధీజీని నా సోదరుడు ఎందుకు చంపాడంటే.. గోపాల్ గాడ్సే

1948 జనవరి 30 న గాంధీజీని నాథూరామ్  గాడ్సే ఎందుకు చంపాడో అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఓ ఇంటర్వ్యూలో వివరించారు. హిందుత్వ నినాదం పట్ల గాంధీజీ విముఖత చూపేవారని, అయితే అప్పటికే ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని జీర్ణించుకున్న నాథూరామ్ గాడ్సే ఆయన సిధ్ధాంతాలను వ్యతిరేకించేవాడని గోపాల్ గాడ్సే తెలిపారు. లౌకికవాదినని చెప్పుకునే గాంధీజీ వద్దకు ఎన్నిసార్లు వెళ్ళబోయినా నాథూరామ్ విఫలమవుతూ వచ్చాడని , ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని నాథూరామ్ వ్యతిరేకించేవాడని ఆయన చెప్పారు. […]

గాంధీజీని నా సోదరుడు ఎందుకు చంపాడంటే.. గోపాల్ గాడ్సే
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 2:51 PM

1948 జనవరి 30 న గాంధీజీని నాథూరామ్  గాడ్సే ఎందుకు చంపాడో అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఓ ఇంటర్వ్యూలో వివరించారు. హిందుత్వ నినాదం పట్ల గాంధీజీ విముఖత చూపేవారని, అయితే అప్పటికే ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని జీర్ణించుకున్న నాథూరామ్ గాడ్సే ఆయన సిధ్ధాంతాలను వ్యతిరేకించేవాడని గోపాల్ గాడ్సే తెలిపారు. లౌకికవాదినని చెప్పుకునే గాంధీజీ వద్దకు ఎన్నిసార్లు వెళ్ళబోయినా నాథూరామ్ విఫలమవుతూ వచ్చాడని , ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని నాథూరామ్ వ్యతిరేకించేవాడని ఆయన చెప్పారు. గాంధీజీ హత్య పట్ల గోపాల్ గాడ్సేలో ఈ నాటికీ ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనను హతమార్చడానికి మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయని, అయితే మూడో సారి నాథూరామ్ సఫలీకృతుడయ్యాడని గోపాల్ గాడ్సే చెప్పారు.  ఒక దశలో ఆయన.. పాక్ పట్ల గాంధీజీ అనుకూల ధోరణితో మాట్లాడడాన్ని నాథూరామ్ సహించలేకపోయేవాడన్నారు.  సత్యాగ్రహం చేస్తానని గాంధీ అనేవారు.సత్యాగ్రహం చేసి మరణిస్తానని అనేవారు. అయితే ఆ సమయంలో తనలాంటి యువకులు కొందరు సత్యాగ్రహం తో కన్నా మా బులెట్లతోనే సమాధానమివ్వాలని అప్పట్లో నిర్ణయించుకున్నాం అని గోపాల్ గాడ్సే పేర్కొన్నారు. (1910 మే 19 న పుట్టిన నాథూరామ్ గాడ్సే ని స్మరించుకుంటూ నిన్న కొందరు సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు).