Relaxes rules for family pension : ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దివ్యాంగుల కోసం కొత్త కుటుంబ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకిచ్చే పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చనిపోయిన ఉద్యోగి లేదా పెన్షనర్ పిల్లలకు మానసిక లేదా శారీరక వైకల్యాలు ఉండి దీర్ఘకాలిక వైద్యం అవసరమైతే వారికి జీవితాంతం పెన్షన్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం సోమవారం నుంచే అమల్లోకి తెచ్చామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ కుటుంబ సభ్యులకు.. వారి ప్రస్తుత వార్షికాదాయాన్ని బట్టి పెన్షన్ ఇచ్చేవారు. ఇకపై ఈ విధానంలోనే ఇప్పుడు మార్పులు చేసి దివ్యాంగులైన కుటుంబసభ్యులకు కూడా పెన్షన్ వచ్చేలా రూపకల్పన చేశారు. సాధారణ కుటుంబ సభ్యులు, వైకల్యం ఉన్న సంతానం అనే రెండు వర్గాలుగా మార్చారు. 1972 లో సిసిఎస్ (పెన్షన్) నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
ఉద్యోగి మొత్తం ఆదాయం, కుటుంబ పెన్షన్ కాకుండా, సాధారణ రేటుతో కుటుంబ పింఛను కంటే తక్కువగా ఉంటుంది. అనగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ డ్రా చేసిన చివరి వేతనంలో 30% అందించేలా కేంద్ర మార్పులు చేసింది. అలాగే, కుటుంబ పెన్షనర్ మరణించిన సమయంలో కుటుంబ పెన్షన్ మంజూరు చేయడానికి ఇతర షరతులను కూడా నెరవేర్చింది.
Read Also.. ఆ సీట్లో నేను కూర్చోలేదు… తనపై ఆరోపణలను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా