Gas Prices: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కొత్త సంవత్సరంలో స్థిరంగా ఉన్న గ్యాస్ ధరలు..

|

Jan 01, 2021 | 11:14 AM

Gas Prices: చమురు కంపెనీలు ఇకనుంచి ప్రతివారం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించనున్నాయి. ప్రతి సమీక్షలో,

Gas Prices: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కొత్త సంవత్సరంలో స్థిరంగా ఉన్న గ్యాస్ ధరలు..
Follow us on

Gas Prices: చమురు కంపెనీలు ఇకనుంచి ప్రతివారం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించనున్నాయి. ప్రతి సమీక్షలో, సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర) ధరను పరిస్థితులను బట్టి తగ్గించడం లేదా పెంచడం చేస్తాయి. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. . దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.694 (14.2 కిలోలు)గా ఉంది. అయితే వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రం రూ.56 వరకు పెంచారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ఢిల్లీలో19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1332 నుంచి రూ.1349 వరకు పెరిగింది. అంటే రూ.17 పెరిగింది. ఇక కోల్‌కతాలో 19 కిలోల ఎల్పీజీ ధర రూ.1387.50 నుంచి రూ.1410కి పెరిగింది. అంటే రూ.12.50 పెరిగింది. ఇక్కడ దేశీయ గ్యాస్ ధర రూ.720.50గా ఉంది. ఇక ముంబైలో 19 కిలోల ఎల్పీజీ ధర రూ.1280.50 నుంచి రూ.1297.50కి పెరిగింది. ఇక్కడ ధర రూ.17 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ ధర రూ.694గాఉంది. చెన్నైలో 19 కిలోల ఎల్పీజీ ధర రూ.1446.50 నుంచి రూ.1463.50కి పెరిగింది. ఇక్కడ సిలిండర్ ధర రూ.17కి పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ ధర రూ.710గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్యాస్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. తెలంగాణలోని హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్పీజీ ధర రూ.746.50గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 14.2 కిలోల ఎల్పీజీ ధర రూ.854గా ఉంది.