Farmer Pension Scheme: అన్నదాతకు అండగా కేంద్రం.. వృద్ధాప్యంలో పెన్షన్ కోసం సరికొత్త పథకం.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే

|

Aug 17, 2021 | 1:33 PM

 PM Kisan Maandhan Pension Scheme:అందరికీ అన్నం పెట్టి.. తాను మాత్రం అన్నకోసం ఎదురుచూసే అన్నదాతకు వృద్ధాప్యంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడానికి సరికొత్త పథకాన్ని..

Farmer Pension Scheme: అన్నదాతకు అండగా కేంద్రం.. వృద్ధాప్యంలో పెన్షన్ కోసం సరికొత్త పథకం.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే
Farmer
Follow us on

PM Kisan Maandhan Pension Scheme:అందరికీ అన్నం పెట్టి.. తాను మాత్రం అన్నకోసం ఎదురుచూసే అన్నదాతకు వృద్ధాప్యంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడానికి సరికొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఎండకు ఎండి వానకు తడిచి.. పంటను పండించే రైతులకు మలి వయసులో ఆర్థిక ఆసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజనను కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (PM కిసాన్) పొందిన రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి, ప్రభుత్వం పింఛన్ సౌకర్యం పీఎం కిసాన్ మంధన్ యోజనను ప్రారంభించింది. ఏ పథకం లో భాగంగా పీఎం కిసాన్ కింద డబ్బులు వచ్చే రైతులు రూ.3000 వరకు పెన్షన్ పొందుతారు.

PM కిసాన్ మంధన్ యోజన కింద, రైతులకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా, మీరు PM కిసాన్‌లో అకౌంట్ హోల్డర్ అయితే, మీకు ఎలాంటి పేపర్‌వర్క్ అవసరం లేదు. నేరుగా పీఎం కిసాన్ మాన్‌ధన్‌ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత ఈ స్కీమ్ కింద పెన్షన్ అందుతుంది. 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వరకు ఏ రైతు అయినా ఈ పథకంలో చేరొచ్చు. దీని కింద.. రైతు నెలవారీ పెన్షన్ రూ.3000 వరకు పొందుతాడు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి కావాల్సి పత్రాలు:

ఆధార్ కార్డ్ , గుర్తింపు కార్డు, వయసు సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, భూమి సర్వే నంబర్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో

రైతులు మాన్‌ధన్‌ కింద ప్రీమియం చెల్లించాలనుకుంటే.. రిజిస్ట్రేషన్ సులభం. పీఎం కిసాన్ పథకంలో ఉన్నవారు మాన్‌ధన్‌ కింద చెల్లించాలని అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు. దీంతో ప్రతి నెల ప్రీమియం చెల్లించాల్సిన డబ్బులు పీఎం కిసాన్ యోజన కింద వచ్చే డబ్బుల నుంచి కట్ అవుతాయి. రైతుల తమ చేతులో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ పెన్షన్ పథకంలో రిజిస్టర్ అయినవారికి 60 ఏళ్ల తర్వాత వార్షిక పెన్షన్ రూ .36,000 ఇస్తారు. రైతులు రూ. 55 నుంచి రూ.200 వరకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక పీఎం కిసాన్ మాన్‌ధన్‌లో కుటుంబ పెన్షన్ కూడా ఉంది. రైతు అకాల మరణం చెందితే జీవిత భాగస్వామికి పథకం వర్తిస్తుంది. ఆ తరువాత ఆమెకు 50 శాతం పింఛను అందుతుంది.

Also Read:  శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి సర్వదర్శనానికి అనుమతి