దేశంలో జోరుగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా.. ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా జరుగుతోందంటే..

| Edited By: Pardhasaradhi Peri

Dec 12, 2020 | 12:41 PM

భారతదేశంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో కొంతమంది స్మగ్లర్లు దీన్ని అక్రమ వ్యాపారంగా ఎంచుకున్నారు. ప్రభుత్వ సుంకానికి ఎగనామం

దేశంలో జోరుగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా.. ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా జరుగుతోందంటే..
Follow us on

భారతదేశంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో కొంతమంది స్మగ్లర్లు దీన్ని అక్రమ వ్యాపారంగా ఎంచుకున్నారు. ప్రభుత్వ సుంకానికి ఎగనామం పెట్టి రకరకాల పద్దతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశంలోకి అక్రమంగా బంగారం తరలింపు జరుగుతోంది.ముఖ్యంగా బంగారాన్ని అధికంగా వినియోగిస్తున్న ప్రాంతాలకే ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. విదేశాలతో సరిహద్దులున్న నగరాలకు బంగారం సరఫరా సులువుగా జరిగిపోతుంది. కోల్ కత్తా, ముంబై నుంచి చెన్నై, ఢిల్లీ ప్రాంతాలకు సరఫరా జరుగుతుంది. ఇండో-మయన్మార్, ఇండోనేపాల్, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా స్మగ్లింగ్ చేసిన బంగారం మయన్మార్, భూటాన్ సరిహద్దుల నుంచి కోల్ కతాకు ఆ తర్వాత ఇతర మెట్రోపాలిటిన్ సిటీలకు తరలిస్తున్నారు.

డైరెక్టరేట్ ఆఫ్రెవెన్యూ ఇంటిలెజెన్స్ (డీఆర్ఐ) నివేదిక ప్రకారం.. (2016-17) 1,422.70 కిలోలు-72 కోట్లు, (2017-18) 3223.30 కిలోలు-974 కోట్లు, (2018-19) – 4050.11 కిలోలు, (2019-20) -3,800 కిలోలు (2020 ) -సెప్టెంబర్ వరకు1600 కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు అడపాదడపా పలు కేసుల్లో బంగారాన్ని పట్టుకుంటున్నా ఎక్కువ శాతం మాత్రం బ్లాక్ మార్కెట్‌కే తరలిపోతుంది. అత్యధికంగా అక్రమబంగారం స్వాధీన ఘటనలు ఈశాన్య రాష్ట్రాల్లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా విమానాలు, భూ రవాణామార్గాల్లోనే జరుగుతోంది. కొన్నిసార్లు సముద్రమార్గాన కూడా చేస్తున్నారు. 2018-19లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న కేసుల్లో 1102 మంది అరెస్టు అయ్యారు. (2020) సెప్టెంబర్ వరకు అధికారులు 1600 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. (2020) ఆగస్టువరకు 2112 కిలోల బంగారం సీజ్ కేసులు నమోదయ్యాయి. (2020) ఫిబ్రవరిలో 484 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. (2020) మార్చిలో 205.81 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. (2020) ఏప్రిల్లో 280.66 కిలోలు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. 2020 మేలో లాక్ డౌన్ తో బంగారం స్మగ్లింగ్ కేసులు వెలుగులోకి రాలేదు. (2020) జూన్ లో 37.54 కిలోలు, జూలైలో 104 కేసులు, 127.70 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. (2020) ఆగస్టులో 185 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా 101 కేసులు నమోదు చేశారు. అలాగే దేశంలో కొన్ని ముఖ్యమైన బంగారం సీజింగ్ కేసులు ఇలా ఉన్నాయి. 2020 ఆగస్టులో డీఆర్ఐ 504 బంగారు కడ్డీలు (83.42 కిలోలు) వీటి విలువ రూ.43కోట్లు, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంపాల్మోరే రోడ్, మయన్మార్ సరిహద్దులో 10.30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. న్యూజల్పాయుర్గీ రైల్వే స్టేషన్ లో 26.56 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2020 జూలైలో కోల్ కతా ఏజెన్సీలో 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2020 జులైలో తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

2-10-2020న పశ్చిమబెంగాల్ లోని సిలిగురి జిల్లాలో డీఆర్ ఐ 33 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు.31-7-2020న శంషాబాద్ విమానాశ్రయంలో 11 మంది అరెస్ట్ చేసి 3.11 కిలోల బంగారం పట్టుకున్నారు.15-2-2020l శంషాబాద్ విమాశ్రయంలో 1,100 గ్రాముల బంగారం పట్టుకున్నారు. 8-2-2020న శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2-2-2020న 30కిలోల విలువైన బంగారం పట్టుకున్నారు. 26-8-2019న శంషాబాద్ విమాశ్రయం వద్ద 3కిలోల బంగారం పట్టుకున్నారు. 9-10-2020న చెన్నై విమానాశ్రయంలో రెండురోజుల్లో 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 4-10-2020న శంషాబాద్ లో 21 కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. 25-10-2020న శంషాబాద్ లో 1.386 కిలోల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. 5-11-2020న శంషాబాద్ విమానాశ్రయంలో 71.47 గ్రా. బంగారం స్వాధీనం చేసుకున్నారు.11-12-2020 న తమినాడు మండపం వద్ద పడవలో 9కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.