నింగిని దాటి వెళుతోన్న బంగారం ధరలు

|

Oct 12, 2020 | 1:09 PM

నింగినంటిన బంగారం ధరలు బెట్టు చేస్తున్నాయి. దిగిరాము దిగిరాము దివి నుంచి భువికి అంటూ మారాం చేస్తున్నాయి.. తగ్గినట్టే కనిపించినప్పటికీ మూడురోజులుగా పైకి వెళుతున్నాయే తప్ప కిందకు దిగడం లేదు..

నింగిని దాటి వెళుతోన్న బంగారం ధరలు
Follow us on

నింగినంటిన బంగారం ధరలు బెట్టు చేస్తున్నాయి. దిగిరాము దిగిరాము దివి నుంచి భువికి అంటూ మారాం చేస్తున్నాయి.. తగ్గినట్టే కనిపించినప్పటికీ మూడురోజులుగా పైకి వెళుతున్నాయే తప్ప కిందకు దిగడం లేదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగానే ఉన్నా డాలర్‌ బలపడటంతో దేశీ మార్కెట్‌లో పుత్తడి ధరలు పెరిగాయి. ఎంపీఎక్స్‌లో తులం బంగారం ధర 261 రూపాయలు పెరిగి 51,078 రూపాయల దగ్గర ట్రేడవుతోంది.. వెండి కూడా అంతే.. కిలో వెండి ఏకంగా 1,103 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం కిలో వెండి ధర 63,987 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే బంగారం ధరలు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి.. డాలర్‌ బలోపేతం, ఉద్దీపన ప్యాకేజ్‌పై స్పష్టత రాకపోవడం పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.. మూడు వారాల గరిష్టస్థాయి నుంచి బంగారం ధరలు కొంత తగ్గాయి.. ఔన్స్‌ బంగారం ధర కొద్దిగా తగ్గింది.. 1925 డాలర్లకు దిగివచ్చింది.